Site icon NTV Telugu

Liquor Shops Closed: మద్యం ప్రియులకు షాక్.. ఈ నెల 20న వైన్ షాప్స్ బంద్

Karnataka

Karnataka

Liquor Shops Closed: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఎక్సైజ్ అధికారుల దోపిడిని ఆరికట్టాలంటూ కన్నడ రాష్ట్రంలో లిక్కర్ షాప్స్ ఓనర్స్ ఆందోళన బాట పట్టబోతున్నారు. ఈ సందర్భంగా కర్ణాటకలోని మద్యం దుకాణాలు నవంబరు 20వ తేదీన మూత పడబోతున్నాయి. ఎక్సైజ్ శాఖలోని అవినీతి, రాష్ట్ర సర్కార్ పట్టించుకోకపోవడంతో.. 20వ తారీఖున మద్యం అమ్మకాలను పూర్తిగా నిలిపివేస్తామని కర్ణాటక మద్యం వ్యాపారుల సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి బి.గోవిందరాజ హెగ్డే తెలిపారు. తమ ఒక్క రోజు నిరసన వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు దాదాపు 120 కోట్ల రూపాయల నష్టం కలుతుందని వెల్లడించారు.

Read Also: Health Tips: బాబోయ్‌.. ఆవలింత వల్ల ఇన్ని కష్టాలా?

అలాగే, నవంబరు 20వ తేదీన బెంగళూరులోని ఫ్రీడం పార్కు దగ్గర మద్యం వ్యాపారుల సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రధాన కార్యదర్శి గోవిందరాజ హెగ్డే వెల్లడించారు. లంచాల కోసం ఎక్సైజ్ అధికారుల తమపై వేధింపులు, యథేచ్ఛగా సాగుతున్న కల్తీ లిక్కర్ అమ్మకాలతో తాము విసిగి వేసారి పోయామని ఆయన చెప్పుకొచ్చారు. తమ డిమాండ్లపై చర్చించేందుకు ఎక్సైజ్, పోలీసు విభాగాల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఈ సందర్భంగా కోరారు. రాష్ట్ర ఆర్థిక శాఖలో ఎక్సైజ్ విభాగాన్ని విలీనం చేయాలని డిమాండ్ చేశారు.

Exit mobile version