Site icon NTV Telugu

Karnataka: విషాదం.. వధువుకు తాళి కట్టిన క్షణాల్లోనే వరుడు మృతి..

Karnatkja

Karnatkja

Karnataka: కర్ణాటకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలోనే వరుడు మృతి చెందాడు. నిండు నూరేళ్లు కలిసి ఉండాలని బంధువులు ఆశీర్వదించిన కొద్దిసేపటికే పెళ్లి మండపంలోనే కుప్పకూలాడు. మంగళసూత్రం వధువు మెడలో కట్టిన వెంటనే, 25 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన పెళ్లికి వచ్చిన వారితో పాటు అందర్ని షాక్‌కు గురిచేసింది.

Read Also: Amit Shah: “మేము అణ్వాయుధ బెదిరింపులకు భయపడము”.. పాక్‌కు అమిత్ షా వార్నింగ్..

శనివారం కర్ణాటకలోని బాగల్‌కోట్‌లోని జమ్ ఖండి పట్టణంలో ఈ విషాదం జరిగింది. వరుడు ప్రవీణ్ తాళి కట్టిన కొన్ని నిమిషాలకే ఛాతి నొప్పితో నేలపై కుప్పకూలాడు. వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన యువతలో పెరుగుతున్న గుండెపోటు ముప్పును సూచిస్తోంది.

మృతుడు ప్రవీణ్ జామఖండి తాలూకాలోని కుంబరహల్లా గ్రామ నివాసి. అతను ప్రస్తుతం జామఖండి నగరంలో నివసిస్తున్నాడు. వధువుది బెల్గాం జిల్లా అథని తాలూకాలోని పార్థనహళ్లి గ్రామం. ఆ వధువు ప్రవీణ్ మామ కూతురు.అందమైన జీవితం గడపాల్సిన ఈ జంట సంతోషం కొన్ని క్షణాల్లోనే ఆవిరైంది. ఈ సంఘటనతో పెళ్లికి వచ్చినవారు కన్నీటి పర్యంతమయ్యారు. పెళ్లి కూతురు కుటుంబం కన్నీరమున్నీరవుతోంది.

ఈ ఏడాది ఫిబ్రవకిలో ఇలాగే మధ్యప్రదేశ్‌లో ఒక వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తున్న సమయంలో 23 ఏళ్ల యువతి గుండెపోటుకు గురై మరణించింది. గత డిసెంబర్ యూపీ అలీఘర్‌లో పాఠశాలలో పరుగుల పోటీలో పాల్గొన్న 14 ఏళ్ల బాలుడు గుండెపోటుకు గురై మరణించాడు.

Exit mobile version