Yediyurappa: లైంగిక వేధింపుల కేసులో మాజీ సీఎంకు పోలీసుల నోటీసులు..
- లైంగిక వేధింపుల కేసులో యడియూరప్పకు నోటీసులు..
- మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు..
- ఈ ఏడాది మొదట్లో కేసు నమోదు..
- ఆరోపణల్ని ఖండించిన కర్ణాటక మాజీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yediyurappa: మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే అభియోగాలపై కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నేత యడియూరప్పకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోక్సో (లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ) కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని కర్ణాటక పోలీసు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) నుంచి నోటీసులు వచ్చాయి. 17 ఏళ్ల మైనర్ బాలికపై యడియూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఈ ఏడాది ప్రారంభంలో కేసు నమోదైంది. చీటింగ్ కేసులో సాయం కోసం ఫిబ్రవరి 2న యడియూరప్ప సాయం కోసం వెళ్లిన సందర్భంలో తన కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాలిక తల్లి ఫిర్యాదు చేశారు.
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
యడియూరప్పపై పోక్సో యాక్ట్‌తో పాటు ఐపీసీలోని సెక్షన్ 354(ఏ) కింద లైంగిక వేధింపుల కేసు నమోదైంది. యడియూరప్ప తన న్యాయవాదుల ద్వారా సీఐడీ ముందు హాజరు కావడానికి ఒక వారం పొడగింపు కావాలని అభ్యర్థించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఇప్పటికే విచారణ బృందం మూడుసార్లు విచారించింది, ప్రస్తుతం ఆయన నాలుగోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంది.
తొలుత సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తదుపరి విచారణ కోసం సీఐడీకి బదిలీ చేశారు. అయితే, యడియూరప్ప మాత్రం ఈ ఆరోపణల్ని ఖండించారు. నిరాధారమైనవిగా పేర్కొన్నారు. 81 ఏళ్ల యడియూరప్ప కర్ణాటక బీజేపీలో సీనియర్ నేత. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2008-2011 మధ్య, 2018లో కొంత కాలం, మళ్లీ జూలై 2019-2021 వరకు సీఎంగా పనిచేశారు. 2021లో సీఎంగా రాజీనామా చేశారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!