Site icon NTV Telugu

Priyank Kharge: కర్ణాటక మంత్రికి బెదిరింపులు.. “మనువాదుల” పనే అంటూ విమర్శలు..

Priyank Kharge

Priyank Kharge

Priyank Kharge: కాంగ్రెస్ మంత్రి, కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గేకి బెదిరింపులు వస్తున్నాయి. తనను కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులు లేఖలు పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు. తనను ఎన్‌కౌంటర్ చేస్తానని తన కార్యాలయానికి బెదిరింపు లేఖలు వచ్చినట్లు తెలిపారు. తన ప్రాణాలకు ముప్పుతో పాటు దళిత నేపథ్యాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని మంత్రి తెలిపారు. తనకు ‘మనువాదుల’ నుంచి బెదిరింపులు వచ్చినట్లు ఆయన వ్యాఖ్యానించారు.

Read Also: Pakistan: పాకిస్తాన్-చైనా స్నేహానికి శత్రువులే ఈ దాడికి పాల్పడ్డారు..

ఇటీవల తనకు మనువాదుల నుంచి మాట్లాడవద్దని ప్రేమ లేఖలు వచ్చాయని, తాను దళితుడు కావడంతో మాట్లాడొద్దని బెదిరిస్తు్న్నారని ఆయన అన్నారు. నా కుటుంబం గురించి కూడా దుర్భాషలాడుతున్నారని ప్రియాంక్ ఖర్గే ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీనిపై విధానసౌధ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు కూడా కాంగ్రెస్ నాయకుడు చెప్పారు. ఈ బెదిరింపుల్లో బీజేపీ ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు.

2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తన కుటుంబాన్ని తుడిచిపెట్టేస్తానని బెదిరించిన గుండాకి బీజేపీ టికెట్ ఇస్తోందని ఖర్గే ఆరోపించారు. దళితులు ఇంత పెద్దగా మాట్లాడకూడదని, దళితులు రాజకీయాల్లోకి రాకూడదని, దళితులు సమాజం మెట్లు ఎక్కకూడదని తనకు ‘మనువాదుల’ నుంచి బెదిరింపులు వచ్చాయని, మీరు ఇలాగే మాట్లాడితే ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరిస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు.

Exit mobile version