Karnataka Minister KS Eshwarappa comments on Tipu Sultan: కర్ణాటకలో ఇటీవల కాలంలో మతపరమైన ఉద్రిక్తతలు ఎక్కువ అవుతున్నాయి. బీజేపీ కార్యకర్తల హత్యలు, శివమొగ్గ టిప్పు సుల్తాన్ ప్లెక్స్ వర్సెస్ వీర్ సావర్కర్ ప్లెక్స్ వివాదం రాష్ట్రంలో ఉద్రిక్తతలను పెంచాయి. తాజాగా కొంతమంది నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా పరిస్థితిని తీవ్రంగా మారుస్తోంది. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప ఇటీవల టిప్పు సుల్తాన్ ముస్లిం గూండా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈశ్వరప్ప వ్యాఖ్యలను ఖండించారు.
ఇదిలా ఉంటే టిప్పు సుల్తాన్ ను మరోసారి ముస్లిం గూండా అని పిలిస్తే నాలుక కోస్తామని బెదిరింపు లేఖ రాశారు.. లేఖను ఆయన ఇంటికే పంపారు కొంతమంది దుండగులు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే ఈశ్వరప్ప. తాను ఎప్పుడూ ముస్లింలందరినీ గుండాలని పిలవలేదని.. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని ఈశ్వరప్ప అన్నారు. కర్ణాటక శివమొగ్గలో మైనారిటీలు మతపరమైన ఉద్రిక్తతలను రెకేత్తిస్తున్నారని ఆయన మంగళవారం ఆరోపించారు.
Read Also: Dead Body Missing: భార్య దారుణం.. కనిపించని భర్త డెడ్ బాడీ
ముస్లింలు అందరూ గుండాలని అనడం లేదని.. ముస్లిం సమాజంలో పెద్దలు గతంలో శాంతి కోసం ప్రయత్నం చేశారని.. గుండాయిజంతో మునిగిపోతున్న యువతకు సలహా ఇవ్వాలిన ముస్లిం మత పెద్దలను కోరారు ఈశ్వరప్ప. లేని పక్షంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు.
ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శివమొగ్గ సిటీలో అమీర్ అహ్మద్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన వీర్ సావర్కర్ పోస్టర్‌ను ఓ వర్గం యువకులు తొలగించారు. దీంతో మరో వర్గం వారు నిరసన తెలిపారు. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెల్తాయి. దీంతో ఆ ప్రాంతంతో కొన్ని రోజులు కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. ఆగస్టు 16న బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కెంపేగౌడ మెట్రో స్టేషన్‌లో వీడీ సావర్కర్ పెయింటింగ్‌ను ప్రదర్శన కూడా వివాదానికి కారణం అయింది.