Bhagavad Gita teachings in Karnataka schools from December: డిసెంబర్ నుంచి కర్ణాటక పాఠశాలల్లో కీలక ఘట్టం మొదలుకానుంది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాల్లలో నైతిక విద్యలో భాగంగా ‘ భగవద్గీత’ను బోధించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అయితే భగద్గీత బోధిస్తే ఖురాన్ ను ఎందుకు బోధించరని ముస్లింలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఖురాన్ మతపరమైన గ్రంథమని.. భగవద్గీత మతపరమైన గ్రంథం కాదని.. కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ అన్నారు. భగవంతుని ఆరాధన గురించి భగవద్గీతలో ఉండదని.. మతపరమైన ఆచారాలను గురించి భగవద్గీత చెప్పదని.. కేవలం నైతికత గురించి మాత్రమే బోధిస్తుందని ఆయన అన్నారు. ఇది విద్యార్థులకు ప్రేరణ, స్ఫూర్తిని ఇస్తుందని ఆయన అన్నారు.
Read Also: Special Story on Gautam Adani: గౌతమ్ అదానీకి ఇంత తక్కువ సమయంలో అంత డబ్బు ఎలా వచ్చింది?
స్వాతంత్య్ర సమరయోధులు కూడా గీత నుంచి ప్రేరణ పొంది పోరాడారని ఆయన అన్నారు. శాసన మండలిలో ఎంకే ప్రాణేస్ అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ మంత్రి నగేష్ ఈ వ్యాక్యలు చేశారు. భగవద్గీతను ప్రత్యేక పాఠ్యాంశంగా బోధించాలనే ప్రతిపాదన విరమించుకున్నామని..అయితే అందులోని బోధనలు నైతిక విద్యలో భాగంగా ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.ప్రభుత్వం ఇప్పటికే నిపుణుల కమిటీని నియమించిందని.. వారి సూచనలు, సిఫార్సుల మేరకు డిసెంబర్ నుంచి పాఠశాలల్లో గీత బోధనలు ప్రారంభం అవుతాయిన ఆయన వెల్లడించారు.
కర్ణాటకలోని స్థానిక రాజులు, రాష్ట్రానికి సంబంధించిన విషాయాలను పాఠ్యాంశాల్లో చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. స్థానిక రాజులు, రాజ్యాల పాఠ్యాంశాలను 6 నుంచి 10 తరగతుల సోషల్ స్టడీస్ పాఠ్యాంశాల్లో చేరస్తామని తెలిపారు. గంగా, హోయసలు, మైసూర్ వడియార్, విజయపుర సామ్రాజ్యం, శాతవాహన, కళ్యాని చాళుక్య, బహమనీ, విజయనగరం, సురపుర నాయక, హైదరాలీ-టిప్పు సుల్తాన్, తుళునాడు, యలహంక నాడ ప్రభు, చిత్రదుర్గ వీరులకు సంబంధించిన వీరుల పాఠ్యాంశాలను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. భగవద్గీత పాఠ్యాంశంలో భాగం కానప్పటికీ.. దాని ఆధారంగా పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాక మంత్రి నగేష్ స్పష్టం చేశారు.