యడియురప్ప.. కర్నాటకలో బీజేపీకి బలమైన నాయకుడు..! లింగాయత్ వర్గానికి చెందిన యడియురప్ప.. బీజేపీలో కీలక నాయకుడిగా ఎదిగారు. పార్టీ నుంచి బయటికి వచ్చినా.. ఆయన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. అలాంటి యడియురప్పకు జులై నెల అంటే టెన్షన్ పట్టుకుంటోంది. ఆయన రెండుసార్లు ఇదే నెలలో బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. 2008లో యడియురప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ ఆ పదవిలో ఎక్కువ సమయం ఉండలేకపోయారు. మూడేళ్లకే ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అంటే 2011…
కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించింది కర్ణాటక ప్రభుత్వం.. ప్రస్తుత లాక్‌డౌన్ గడువు ఈనెల 24తో ముగియనుండగా.. జూన్ 7వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం యడ్యూరప్ప ప్రకటించారు.. రాష్ట్రంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ కేసులు వ్యాపించిన నేపథ్యంలో మరో 14 రోజులు లాక్‌డౌన్ పొడిగించినట్టు వెల్లడించారు. మంత్రులు, అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించిన సీఎం.. ఆ తర్వాత లాక్‌డౌన్‌పై ప్రకటన చేశారు.. ఈ సమయంలో ఉదయం 6…