KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
- కర్ణాటకలో తొలి యూనివర్సిటీగా KSLU
- ఎల్ఎల్బీలో ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Transgender Reservation in Law Education: న్యాయ విద్యలో ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు ప్రత్యేక రిజర్వేషన్ అమలు చేసిన రాష్ట్రంలోని తొలి విశ్వవిద్యాలయంగా కర్ణాటక స్టేట్ లా యూనివర్సిటీ (KSLU) నిలిచింది. మూడు సంవత్సరాల ఎల్ఎల్బీ కోర్సులో ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు 1 శాతం రిజర్వేషన్ కల్పించాలని యూనివర్సిటీ నిర్ణయించింది. ఈ మేరకు సెప్టెంబర్ 16న నోటిఫికేషన్ జారీ చేసింది. కర్ణాటకలోని 128 లా కాలేజీలు KSLU పరిధిలో ఉన్నాయి. కర్ణాటక హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో యూనివర్సిటీ ఈ నిర్ణయం తీసుకుంది. 2014లో సుప్రీంకోర్టు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన తీర్పును కూడా హైకోర్టు తన ఆదేశాల్లో ప్రస్తావించింది.
2023లో కోర్టును ఆశ్రయించిన ట్రాన్స్‌జెండర్ విద్యార్థి
ఈ వ్యవహారం 2023లో వెలుగులోకి వచ్చింది. నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU)లో ప్రవేశం నిరాకరించడంతో ఒక ట్రాన్స్‌జెండర్ విద్యార్థి కోర్టును ఆశ్రయించారు. కర్ణాటక ప్రభుత్వం, యూనివర్సిటీలు 2017 కర్ణాటక ట్రాన్స్‌జెండర్ పాలసీని అమలు చేయడంతో పాటు ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు రిజర్వేషన్ కల్పించాలని విద్యార్థి కోరారు. కేసు విచారణ సమయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎల్ఎల్బీ కోర్సులో ఆ విద్యార్థికి ప్రవేశం కల్పించాలని యూనివర్సిటీని ఆదేశించింది.
Also Read
- Robbery: తనిష్క్లో భారీ చోరీ.. రూ.50 కోట్ల విలువైన నగలు అపహరణ..
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ అరాచకం.. హసీనా రాకముందే బాంబు దాడులు, ఆందోళనలు!
- UP Elections: యూపీలో ఒవైసీ-చంద్రశేఖర్ పొత్తు.. బీజేపీ హ్యాపీ, అఖిలేష్లో టెన్షన్.!
- Suryakumar Yadav: బీజేపీలోకి సూర్యకుమార్? యాదవుల ఓట్లే టార్గెట్.. యూపీ ఎన్నికల్లో స్కై భార్యకు టికెట్?
NLSIUకి రిజర్వేషన్ విధానం రూపొందించాలని ఆదేశం
2024 డిసెంబర్ 16న హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ కేసులో తుది ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు NALSA కేసులో ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం రిజర్వేషన్ విధానాన్ని రూపొందించాలని NLSIUని ఆదేశించింది. అలాగే తదుపరి విద్యా సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమయ్యేలోపు ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయం అందించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇదే సమయంలో మధ్యంతర ఏర్పాటుగా NLSIUలో ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు 0.5 శాతం రిజర్వేషన్, ఫీజులో రాయితీ కల్పించాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ NLSIU హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది.
మరో లా కాలేజీలో ప్రవేశానికి కూడా ప్రయత్నం
సంబంధిత ట్రాన్స్‌జెండర్ విద్యార్థికి రాష్ట్రంలోని మరో లా కాలేజీలో ఎల్ఎల్బీ ప్రవేశం, ఆర్థిక సహాయం కల్పించే అవకాశం ఉందా అనే విషయాన్ని పరిశీలించాలని కర్ణాటక ప్రభుత్వం, KSLUలను హైకోర్టు ఆదేశించింది. తర్వాత BMS కాలేజ్ ఆఫ్ లా, శేషాద్రిపురం లా కాలేజీల్లో విద్యార్థి కోసం సీట్లు కేటాయించినట్లు కోర్టుకు తెలియజేశారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్
కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు రిజర్వేషన్ కల్పించే చర్యలు చేపట్టింది. 2021లో కర్ణాటక సివిల్ సర్వీసెస్ (జనరల్ రిక్రూట్మెంట్) (అమెండ్మెంట్) రూల్స్‌ను నోటిఫై చేసింది. ఈ నిబంధనల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు హారిజాంటల్ రిజర్వేషన్ కల్పించే నిబంధనను తీసుకొచ్చింది. తాజాగా KSLU మూడు సంవత్సరాల ఎల్ఎల్బీ కోర్సులో 1 శాతం రిజర్వేషన్ అమలు చేయడంతో, కర్ణాటకలో న్యాయ విద్యలో ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు ప్రత్యేక కోటా కల్పించిన తొలి యూనివర్సిటీగా నిలిచింది.
తాజావార్తలు
-
Tabitha Sukumar: గొడవ మధ్యలోనే సుకుమార్ అలా చేస్తారట.. తబిత సుకుమార్ చెప్పిన ముచ్చట వింటే నవ్వాగదు!
-
New Pensions: కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం.. నవంబర్ 19న అకౌంట్లోకి డబ్బులు జమ..
-
IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ.. హైదరాబాద్ కమిషనర్‌గా కొత్త బాస్..
-
TG SAFE: పెద్ద బ్రాండ్లే కదా అని సేఫ్ అనుకుంటున్నారా? డొమినోస్, కేఎఫ్‌సీ స్టోర్లలో తనిఖీలతో కలకలం!
-
Nvidia Scandal: జెన్సన్ హువాంగ్-ఆలిస్లను కలిపింది ఆమె భర్తే.. ఎన్విడియా కేసులో ట్విస్ట్..
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!