Site icon NTV Telugu

Karnataka Hijab Ban: హిజాబ్ వివాదంపై రేపు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించే అవకాశం

Karnataka Hijab Ban

Karnataka Hijab Ban

Supreme Court Order Likely Tomorrow on Karnataka Hijab Ban:కర్ణాటకలో ప్రభుత్వ హిజాబ్ ధరించి విద్యాలయాలకు రావడాన్ని నిషేధించింది. ప్రభుత్వ ఉత్తర్వులపై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిగా.. హిజాబ్ అనేది ఇస్లాంలో తప్పనిసరి ఆచారం కాదని, హిజాబ్ ధరించి విద్యాలయాలకు రావడాన్ని నిషేధించింది. అయితే ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది. ఇదిలా ఉంటే హిజాబ్ బ్యాన్ పై సుప్రీంకోర్టు రేపు తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరించి కర్ణాటక హైకోర్టు తీర్పుపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం 10 రోజుల పాటు విచారించింది. సెప్టెంబర్ 22న తీర్పును రిజర్వ్ లో ఉంచింది. కాగా.. ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ హేమంత్ గుప్తా ఆదివారం పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఈ వారంలోనే ఈ పిటిషన్లపై తీర్పు వెలువడే అవకాశం ఉంది.

Read Also: VRA Strike: ప్రభుత్వంతో విఆర్ఏల చర్చలు సఫలం.. రేపట్నుంచి విధుల్లోకి!

సుప్రీంకోర్టులో హిజాబ్ కు మద్దతుగా పిటిషనర్ల తరుపున న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. ముస్లిం బాలికలు హిజాబ్ లేకుండా పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారని.. దీంతో వారి చదువులకు ఆటంకం ఏర్పడుతుందని.. చాలా మంది పాఠశాలకు వెళ్లడమే మానేశారని సుప్రీంకోర్టుకు విన్నవించారు. పాఠశాలలో, కళాశాల్లలో సమానత్వం, సమగ్రతకు భంగం కలిగించే దుస్తులను నిషేధిస్తూ కర్ణాటక రాష్ట్రప్రభుత్వం ఫిబ్రవరి 5, 2022 నాటి ఉత్తర్వులోని అంశాలను సుప్రీంకోర్టుకు వివరించారు ప్రభుత్వం తరుపున న్యాయవాదులు.

ఈ కేసును ముందుగా రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని సమర్థిస్తూ కొందరు వ్యక్తులు ఆందోళనలు చేయడం ఓ పథకంలో భాగమని ప్రభుత్వం తరుపున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. మార్చి 15న కర్ణాటకలోని ఉడిపిలోని ప్రభుత్వం ప్రీ యూనివర్సిటీ గర్ల్స్ కాలేజీకి చెందిన ముస్లిం విద్యార్థలు తరగతి గదులలో హిజాబ్ ధరించడానికి అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. ఈ హిజాబ్ వివాదం ఉడిపి నుంచి కర్ణాటకలోని చిక్ మంగళూర్, మాండ్యా, బాగల్ కోట్, దక్షిణ కన్నడ జిల్లా, బెంగళూర్, తుముకూరు, చిక్ బల్లాపూర్, శివమొగ్గ జిల్లాలకు కూడా వ్యాపించింది.

Exit mobile version