NTV Telugu Site icon

Karnataka: స్కూల్ హెడ్‌మాస్టర్‌ని చితక్కొట్టిన అమ్మాయిలు..

Karnataka

Karnataka

Karnataka Headmaster Brutally Thrashed By Schoolgirls For Harassing Minor: విద్యార్థులతో దురుసుగా ప్రవర్తిస్తున్న ఓ స్కూల్ ప్రధానోపాధ్యాయుడికి బుద్ధి చెప్పారు విద్యార్థినులు. కర్ణాటకలోని శ్రీరంగపట్నంలోని కట్టేరి గ్రామంలో చోటు చేసుకుంది. స్కూల్ హెడ్ మాస్టర్ గత కొంత కాలంగా మైనర్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో అతనికి బుద్ధి వచ్చేలా దేహశుద్ధి చేశారు. చిన్మయ ఆనందమూర్తి అనే వ్యక్తి హస్టల్ విద్యార్థినులలో ఒకరితో అసభ్యంగా ప్రవర్తించారు. బాధితురాలు ఈ విషయాన్ని తన రూమ్‌మేట్‌లను చెప్పింది. దీంతో విద్యార్థినులు అతడిని చితకబాదారు. విద్యార్థినులు కట్టేరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు.

Read Also: Shraddha Walkar: శ్రద్ధా వాకర్ హత్యలో కీలక పరిణామం.. డీఎన్ఏ ఫలితాలు చెప్తున్నది ఇదే..

నిజానికి హెడ్ మాస్టర్ ఆనంద మూర్తి సాయంత్రం 5 గంటల వరకే విధుల్లో ఉండాలి. కానీ రాత్రి 12 గంటల వరకు ఇక్కడే ఉండేవాడు. చాలా సార్లు పలువురు దీని గురించి ప్రశ్నిస్తే విద్యార్థులకు ఇచ్చే ఆహారం, ఇతర విషయాలను సమన్వయం చేయడానికి అని చెప్పేవాడని తెలిసింది. దురుద్దేశంతోనే ఇలా చేసేవాడని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. తాజాగా విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థిని కేకలు వేయడంతో, మిగతా అమ్మాయిలు కలిసి కొట్టారు. గత 3-4 ఏళ్లుగా ఇలాగే అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు ఆరోపించారు. ఈ ఘటన తరువాత నిందితుడిని కేఆర్ఎస్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Show comments