Site icon NTV Telugu

Ramesh Jarkiholi : మాజీ మంత్రి రాసలీలలు.. షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు

karnataka

karnataka

కర్ణాటక  బీజేపీ మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళికి సుప్రీంకోర్టులో షాక్‌ తగిలింది. గతేడాది మాజీ మంత్రి రాసలీలల సీడీ లీక్ అయ్యి సంచలనం సృష్టించింది. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనను శారీరకంగా లొంగదీసుకుని లైంగిక వేధింపులకు గురి చేశాడని, రాసలీలల వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో తమ కుటుంబం పరువు పోయిందని, తనకు ప్రాణహాని ఉందని యువతి మాజీ మంత్రి మీద బెంగళూరులో కేసుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసు విచారించిన స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌) కోర్టుకు రమేశ్‌ జార్కిహొళి నిర్దోషి అని తెలుపుతూ బి రిపోర్ట్ ని సమర్పించింది.

హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్ఐటీ విచారణ అధికారి, ఏసీపీ కవితా సంతకం చేసిన 150 పేజీల తుది నివేదిక శుక్రవారం బెంగళూరులోని ఏసీఎంఎం న్యాయస్థానంలో సమర్పించారు. అయితే యువతి తరుపు న్యాయవాదులు ఒక్కసారి ఆ రిపోర్ట్ ని మరోసారి సమగ్ర విచారణ జరపాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ జరిపిన ధర్మాసనం బి-రిపోర్టును పెండింగ్‌లో ఉంచాలని సూచించింది.  ఇక మార్చి 9 న సుప్రీం కోర్టు ఈ కేసుపై తుది తీర్పు ఇవ్వనుంది. సిట్ లో క్లిన్ చిట్ తెచ్చుకున్న మాజీ మంత్రికి సుప్రీం కోర్టు లో ఎలాంటి తీర్పు రానున్నదో తెలియాల్సి ఉంది.

Exit mobile version