NTV Telugu Site icon

Bigg Boss: బిగ్‌బాస్‌లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ప్రతిపక్షాల విమర్శలు..

Big Boss

Big Boss

Bigg Boss: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడు వివాదంగా మారాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కన్నడ బిగ్‌బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వడం పొలిటికల్ దుమారాన్ని రేపుతోంది. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే బిగ్‌బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఓ ప్రమోషనల్ వీడియోను విడుదల చేయడంతో దుమారం చెలరేగింది. ఎమ్మెల్యే కంటెస్టెంట్‌గా రియాలిటీ షోలోకి ప్రవేశించినట్లుగా ఊహాగానాలు వెల్లువెత్తాయి.

దీనిపై వందేమాతరం సామాజిక సేవా సంస్థ కర్ణాటక శాసనసభ స్పీకర్ యూటీ ఖాదర్‌కి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే తన బాధ్యతను విస్మరించి ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.అయితే ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ గెస్టుగా మాత్రమే హౌజులోకి ప్రవేశించాడని బిగ్ బాస్ టీం సోమవారం స్పష్టం చేసింది. ఎమ్మెల్యే గెస్టులాగా బిగ్ బాస్ హౌజులోకి ప్రవేశించాడని, వచ్చిన డబ్బును అనాథాశ్రమానికి విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు.

Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇందుకే పెళ్లి చేసుకోవట్లేదట..

కొంతమంది నెటిజన్లు ఎమ్మెల్యేపై విమర్శలకు దిగగా.. మరికొందరు మీమ్స్ చేస్తున్నారు. ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధి ఇలా బిగ్ బాస్ కి వెళ్లడం దిగజారడమే అని విమర్శించారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అతడిపై చర్యలు తీసుకోవాలని.. ఇంత బాధ్యతరాహిత్యంగా ఎలా ఉన్నారు, కనీసం టీవీ ఛానెల్, కిచ్చా సుదీప్ కి ఈ మాత్రం తెలియదా..? అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.