Congress: కర్ణాటక కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. కేపీసీసీ అధ్యక్షు పదవీపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో మరో మంత్రి మాటల యుద్ధానికి దిగారు. నాయకులు ఇష్టానుసారం మాట్లాడరాదని ఇటీవలే హైకమాండ్ ఆదేశించినా పట్టించుకునే పరిస్థితి అక్కడ కనపడటం లేదు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. కేపీసీసీ అధ్యక్ష పదవీ మార్కెట్లో దొరకదన్నారు. మనం పార్టీకి చేసిన సేవలు, శ్రమను గుర్తించి సరైన పదవి ఇస్తారని తెలిపారు. కానీ, కొందరు మాత్రం మీడియా ముందుకు వచ్చి పదవి కావాలని అడుగుతున్నారని డీకే శివకుమార్ అన్నారు.
Read Also: Venky : సంక్రాంతికి వచ్చాడు.. వంద కోట్లు రాబట్టాడు
ఇక, పార్టీలో అందరూ క్రమశిక్షణతో ఉండాలని రాహుల్ గాంధీ, సీఎం సిద్దరామయ్య సూచించారని డీకే శివ కుమార్ తెలిపారు. పార్టీని నేనొక్కడే కాదు, కార్యకర్తలు, ప్రజలు కలిసి గెలిపించారని చెప్పుకొచ్చారు. అలాగే, జై భీమ్ సమావేశాల నిర్వహణ పరిశీలనకు ఇన్‌చార్జి సుర్జేవాలా ఈరోజు (జనవరి 17) బెళగావికి వస్తున్నారని పేర్కొన్నారు. మీరు ప్రశ్నలు ఏమైనా ఉంటే ఆయనను అడగాలని నేతలకు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ సూచించారు.
Read Also: Padi kaushik Reddy: పోలీసులు 32 ప్రశ్నలు సంధించారు.. అన్నింటికీ సమాధానం చెప్పా!
మరోవైపు, కేపీసీసీ నుంచి నోటీసులు అందుకున్న మంత్రి సతీష్ జార్కిహొళి మాట్లాడుతూ.. ఆ నోటీసులు ఇచ్చినప్పటికీ ఏం కాదన్నారు. దీనికి స్పష్టమైన సమాధానం అధ్యక్షుడికి ఇస్తానన్నారు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఉన్నానని నేను ఎక్కడా చెప్పలేదు.. ఇక, తన మాటల వల్ల ఎవరికీ ఇబ్బంది కలగలేదు.. నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన తెలిపారు. అయితే, కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిణామాలపై భారతీయ జనతా పార్టీ సెటైరికల్ కామెంట్స్ చేసింది. కాంగ్రెస్‌లో ఇలాంటివి కొత్తేమీ కాదని వెల్లడించింది.