Padi kaushik Reddy: పోలీసులు 32 ప్రశ్నలు సంధించారు.. అన్నింటికీ సమాధానం చెప్పా!
- విచారణకు హాజరైన హుజూరాబాద్ ఎమ్మెల్యే
- గంటపాటు విచారించిన పోలీసులు
- 420 హామీలు, 6 గ్యారెంటీలపై ప్రశ్నిస్తునే ఉంటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాసబ్ ట్యాంక్ పోలీసు స్టేషన్‌లో విచారణకు శుక్రవారం హాజరయ్యారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే తన అడ్వకేట్‌తో కలిసి స్టేషన్ లోపలికి వెళ్లారు. ముందుగా అడ్వకేట్‌ను పోలీసులు అనుమతించలేదు. ఉన్నతాధికారుల అనుమతితో పోలీసులు లోపలికి అనుమతించారు. కౌశిక్ రెడ్డిని మాసబ్ ట్యాంక్ పోలీసులు గంటపాటు విచారణ చేశారు. పోలీసులు 32 ప్రశ్నలు అడిగి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.
విచారణ ముగిసిన అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘నాపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలపై ప్రశ్నిస్తే.. నాపై కేసులు పెడుతున్నారు. అయినా కూడా నేను భయపడను. 420 హామీలు, 6 గ్యారెంటీలపై ప్రశ్నిస్తునే ఉంటాను. డిసెంబర్ 4న నేను బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్ళాను. బంజారాహిల్స్ ఏసీపీ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాను. నా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేయడానికి పోతే నాపై కేసులు పెట్టారు. నేను ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు’ అని హుజూరాబాద్ ఎమ్మెల్యే ప్రశ్నించారు.
Also Read
- Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
Also Read: Revanth Reddy: సింగపూర్ విదేశాంగ మంత్రితో సీఎం రేవంత్ భేటీ!
‘పండుగ రోజు కూడా నన్ను దొంగ లాగ అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఈరోజు మాసబ్ ట్యాంక్ పోలీసులు 32 ప్రశ్నలు సంధించారు. అడిగిన ప్రశ్నే అడిగారు. నేను అన్నిటికీ సమాధానం చెప్పాను. విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తా. నేను చేసిన తప్పేమీ లేదు’ అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్పారు. గతేడాది డిసెంబర్ 4న ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు కౌశిక్ రెడ్డి వెళ్లారు. సీఐ వాహనానికి తన వాహనం అడ్డుపెట్టి.. అనుచరులతో హల్‌చల్ చేశారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడని ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!