NTV Telugu Site icon

Covid Scam: కర్ణాటకలో కోవిడ్ స్కాం.. సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..!

Karnataka

Karnataka

Covid Scam: కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్-19 మహమ్మారి సమయంలో జరిగిన కుంభకోణంపై తీవ్ర వివాదం కొనసాగుతుంది. కోవిడ్ పరికరాలు, ఔషధాల కొనుగోలులో జరిగిన అవకతవకలపై విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగింది. దీనిపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది.

Read Also: Heavy Rains: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనద్రోణి.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

కాగా, బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ)లోని నాలుగు జోన్లు, రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి కమిషన్ నివేదికలు కోరింది. సంబంధిత శాఖల నుంచి 55,000 ఫైళ్లను ధృవీకరించిన తర్వాత “పాక్షిక” నివేదికను ప్రభుత్వానికి సిట్ సమర్పించింది. రికవరీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, అవినీతికి పాల్పడిన సంస్థలను బ్లాక్ లిస్ట్ చేయాలని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఇక, క్రిమినల్ ఎలిమెంట్ ఎక్కడ ఉన్నా సిట్ నిష్పక్షపాతంగా విచారణ చేస్తుందని మంత్రి హెచ్‌కె పాటిల్ చెప్పుకొచ్చారు. అయితే, 11 పేజీలతో కూడిన నివేదికను ఆగస్టు 31న సమర్పించినట్లు తెలిపారు.. అందులో రూ. 7,223.64 కోట్ల స్కాం జరిగినట్లు చెప్పారు.

Read Also: Kanaka Durga Temple: మహిషాసురమర్ధినిగా కనకదుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

అయితే, అవకతవకలకు సంబంధించి సంబంధిత అధికారుల ద్వారా క్యాబినెట్ సబ్‌కమిటీకి సహకరిస్తుంది అని మంత్రి హెచ్‌కె పాటిల్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 43 క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది.. మైనింగ్‌లో అక్రమాలపై దర్యాప్తు చేయడానికి కర్ణాటక లోకాయుక్తలో ఏర్పాటు చేసిన సిట్ పదవీకాలాన్ని ఒక సంవత్సరం పొడిగించడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కర్ణాటక స్టేట్ మినరల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (KSMCL) మొత్తం పెట్టుబడితో ఒకలిపురంలో సెరీకల్చర్ శాఖకు చెందిన 4.25 ఎకరాల భూమిలో రూ. 527.50 కోట్ల అంచనా వ్యయంతో “రేష్మే భవన” నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు చెప్పుకొచ్చారు. అలాగే, చిక్కబళ్లాపుర జిల్లాలోని శిడ్లఘట్టలో రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో హైటెక్ కోకూన్ మార్కెట్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది .

Show comments