NTV Telugu Site icon

Karnataka BJP MLC Arrest: మహిళా మంత్రిని దూషించిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్సీ అరెస్ట్..

Ct Ravi

Ct Ravi

Karnataka BJP MLC Arrest: కర్ణాటక శాసనసభ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి.. దీంతో హిరేబాగేవాడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన మంత్రి లక్ష్మీ.. ఆ కంప్లైంట్ లో భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్‌లు 75 (లైంగిక వేధింపులు), 79 సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. ఇక, రంగంలోకి దిగిన బెలగావి పోలీసులు అరెస్ట్ చేసి ఖానాపూర్ పీఎస్ కు తరలించారు.

Read Also: US- Pakistan: పాకిస్థాన్ క్షిపణులతో మాకు ప్రమాదం పొంచి ఉంది..

అయితే, బీజేపీ ఎమ్మెల్సీ సిటీ రవిని ఈ రోజు (డిసెంబర్ 20) ఉదయం బెంగళూరుకు తీసుకొచ్చి ప్రజాప్రతినిధుల కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు. కాగా, బెళగావిలోని కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజైన గురువారం నాడు రాష్ట్ర మహిళ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ శాసన మండలిలో ప్రసంగిస్తుండగా.. బీజేపీ ఎమ్మెల్సీ సిటీ రవి తనపై అసభ్యకరమైన పదాన్ని ఉపయోగించారని ఆరోపించారు. దీంతో ఎమ్మెల్సీ రవిపై అధికారికంగా శాసన మండలి ఛైర్మన్‌కి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. అలాగే, ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ.. ‘అలాంటి భాషను ఉపయోగించడం లైంగిక వేధింపులకు పాల్పడటమేనని పేర్కొన్నారు.