Karnataka: నా కారునే ఆపుతావా?.. రోడ్డుపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే కూతురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమె ఓ ఎమ్మెల్యే కూతురు. అయితే, ఆమె తన కారులో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్‌ను జంప్ చేసింది. అంతేకాకుండా పోలీసులతో అనుచితంగా ప్రవర్తించింది. ఇదంతా రికార్డు చేస్తున్న ఓ విలేకరితో కూడా ఆమె దురుసుగా ప్రవర్తించింది. నా కారునే ఆపుతావా, నేనెవరో తెలుసా అంటూ పోలీసుపై కస్సుబుస్సుమంటూ మండిపడింది. తప్పు చేసి తప్పించుకోవడమే కాకుండా పోలీసులపై ఫైర్ అయిన ఆ యువతి ఓ ప్రజా ప్రతినిధి కుమార్తె అవ్వడం మరో విశేషం. అధికార పార్టీ ఎమ్మెల్యే కుమార్తె తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా విధి నిర్వహణలో ఉన్న పోలీసులను దుర్భాషలాడిన ఆమెపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలీ కూతురు తన బీఎండబ్ల్యూ కారు డ్రైవ్ చేస్తూ రోడ్డుపైకి వచ్చింది. ఓచోట రెడ్ సిగ్నల్ పడినా ఆగకుండా రయ్‌మంటూ దూసుకెళ్లింది.
ఇది తెలిసిన ట్రాఫిక్ పోలీస్ ఆమె కారును వెంబడించి రాజ్‌భవన్ రోడ్డు వద్ద ఆపారు. కారును పోలీసులు అడ్డుకోవడంతో చిర్రెత్తిన ఆమె.. నా కారే ఆపుతావా అంటూ పోలీసులతో అనుచితంగా ప్రవర్తించింది. తాను ఎమ్మెల్యే కూతురినంటూ వారితో వాగ్వాదానికి దిగింది. అంతేకాకుండా ఇదంతా కూడా అక్కడ ఉన్న ఓ రిపోర్టర్ వీడియో తీయడంతో అతడితో కూడా దురుసుగా ప్రవర్తించింది. ‘నేనే ఎవరో తెలుసా. నేను ఇప్పుడు వెళ్లాలి. నా కారును ఆపోద్దు. ఓవర్‌టేక్ చేసినందుకు నాపై కేసు పెట్టలేవు. ఇది ఎమ్మెల్యే వాహనం. మా నాన్న అరవింద్ లింబావలీ’ అంటూ పోలీసులపై రెచ్చిపోయింది.
Also Read
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్‌కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
Telangana Rtc: మళ్ళీ పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. ప్రయాణికులు కస్సు..బస్సు
ఆమె మాటలు పట్టించుకోని పోలీసులు యువతికి జరిమానా విధించారు అలాగే బీఎండబ్ల్యూ కారు నెంబర్‌పై చలాన్లు పరిశీలించగా పోలీసులు ఖంగుతున్నారు. ఆమె వాహనంపై 9 వేల రూపాయల చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అంతేగాక ప్రస్తుతం ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు, నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసినందుకు రూ. 1000 జరిమానా విధించారు. దీంతో మొత్తం రూ.10 వేలను ఆమె నుంచి పోలీసులు రాబట్టారు.
తాజావార్తలు
-
King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Tamannaah Bhatia: ‘రాగిణి 3’ షూటింగ్ ప్రారంభం.. సెట్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
-
OnePlus N6x: వన్‌ప్లస్ N6x త్వరలో భారత్‌లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!