NTV Telugu Site icon

Karnataka: కర్ణాటక బీజేపీలో అంతర్గత పోరు.. రాష్ట్ర అధ్యక్షుడిపై ఎమ్మెల్యే ఫైర్!

Bjp

Bjp

Karnataka: కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో అంతర్గత పోరు కేవలం కాంగ్రెస్ పార్టీలోనే అనుకున్నాం.. కానీ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో లుకలుకలు మొదలు అయ్యాయి. Trump: అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారానికి ముందు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్రపై గోకాక్ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కన్నడ కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని’బచ్చా’ అని పిలిచారు.

Read Also: Pawan Kalyan: డిప్యూటీ సీఎం అనే పదానికి పవన్ కళ్యాణ్ వన్నె తెచ్చారు!

ఇక, శనివారం నాడు బెళగావిలో జరిగిన బహిరంగ సభలో బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళి మాట్లాడుతూ.. ఈ వేదిక ద్వారా నేను విజయేంద్రకు కఠినమైన సందేశాన్ని పంపాలనుకుంటున్నాను.. మీరు ఓ బచ్చా.. ఎక్కువ కాలం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండరు అని తేల్చి చెప్పారు. యడ్యూరప్ప మా నాయకుడు.. అతడి గురించి మాట్లాడినప్పుడల్లా, నేను జాగ్రత్తగా ఉంటా.. ఆయనను మేము నిరంతరం గౌరవిస్తామన్నారు. అలాగే, నేను రాష్ట్రంలో ఎక్కడా స్వేచ్ఛగా తిరగలేనని తెలుసు.. అందుకే, షికారిపుర నుంచి విజయేంద్ర ఇంటి వరకు ఆందోళన కొనసాగిస్తాను తేల్చి చెప్పారు. నేను పోలీసులను, గన్‌మెన్‌లను తీసుకురాను, ఒంటరిగా వస్తానని బీజేపీ చీఫ్ విజయేంద్రకు రమేశ్ జార్కిహోళి సవాల్ విసిరారు. దీంతో ఇరువురు మధ్య వివాదంలో కమలం పార్టీలో అంతర్గత కుమ్ములాటకు దారి తీసింది.