BJP MLA: శివుడు మూడో కన్ను తెరిస్తే రాహుల్ గాంధీ బూడిదే.. పార్లమెంట్‌లోనే అతడిని కొట్టాలి..

  • రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే..
  • పార్లమెంట్‌లో బంధించి కొట్టాలి..
  • శివుడు మూడో కన్ను తెరిస్తే అతడు బూడిదే..
  • హిందూవులను కించపరిస్తే చూస్తూ ఊరుకునేది లేదు..
Bjp Mla Bharat Shetty

Bjp Mla Bharat Shetty

BJP MLA: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే భరత్ శెట్టి, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ వ్యతిరేఖ వ్యాఖ్యలు చేసినందుకు అతడిని పార్లమెంట్‌లో బంధించి, కొట్టాలని అన్నారు. ‘‘ రాహుల్ గాందీని పార్లమెంట్‌ లోపల లాక్కెళ్లి కొట్టాలి. ఈ చర్య ఎడెనిమిది ఎఫ్ఐఆర్‌లకు దాది తీస్తుంది. మంగళూర్ నగరానికి వస్తే, నేను అతడికి ఈ విధంగానే ఏర్పాట్లు చేస్తాను’’ అని మంగళూరు సిటీ నార్త్ ఎమ్మెల్యే శెట్టి అన్నారు.

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శివుడి చిత్రాన్ని పట్టుకున్నారని, శివుడు మూడో కన్ను తెరిస్తే అతను బూదిదగా మారుతాడని ఆ పిచ్చివాడికి తెలియదని, వారు హిందూ వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తున్నారని బీజేపీ నేత ఆరోపించారు. రాహుల్ గాంధీకి పిచ్చి పట్టిందని తేలిపోయిందని, హిందువులు తమ గురించి ఏం చెప్పినా నిశ్శబ్ధంగా వింటారని ఆయన భావిస్తున్నారని, రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో మొరిగితే, స్థానిక నాయకులు ఇక్కడ తోక ఊపడం ప్రారంభిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also: Ukrainian President: మోడీ ఓ క్రిమినల్ను కౌగిలించుకోవడం బాధేసింది..

హిందూ మతాన్ని, సంస్థల్ని రక్షించడం బీజేపీ కర్తవ్యమని ఆయన అన్నారు. హిందువులు, హిందుత్వ అనేది వేర్వేరు అని కాంగ్రెస్ చెప్పడం ప్రారంభించిందని, ఇలాంటి నాయకుల వల్ల భవిష్యత్తులో హిందువులు ప్రమాదంలో పడతారని, హిందువులు బయటకు రాని పరిస్థితి సృష్టిస్తారని అన్నారు. కేరళలో రాహుల్ గాంధీ పర్యటిస్తే సెక్యులర్ వ్యక్తిగా మారుతాడని, అదే తమిళనాడుకి వెళ్తే నాస్తికుడు అవుతారని ఆరోపించారు. గుజరాత్ వచ్చినప్పడు ఆయన పరమ శివ భక్తుడిగా మారారని ఎద్దేవా చేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 99 లోక్‌సభ సీట్లను సాధించి, గొప్ప విజయం సాధించినట్లు రాహుల్ గాంధీ చెప్పుకుంటున్నారని, శివాజీ, మహరాణా ప్రతాప్ హిందూ సమాజంలో జన్మించారు, ఎప్పుడు అవసరం అవచ్చిన ఆయుధాలు తీసుకుంటాం, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో మాకు బాగా తెలుసు, పార్లమెంట్‌లో దెబ్బలు తిన్న రాహుల్ గాంధీ బాగానే ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు.