NTV Telugu Site icon

Narendra Modi: అగ్నిపథ్ పథకంపై విపక్షాల సీరియస్.. మోడీ రియాక్షన్ ఇదే..!

Modi Pm

Modi Pm

Narendra Modi: అగ్నిపథ్‌ పథకంపై విపక్షాలు చేస్తోన్న విమర్శలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రియాక్ట్ అయ్యారు. భారత బలగాలకు సంబంధించి పెన్షన్ నిధులు ఆదా చేసేందుకే ఈ పథకం తీసుకువచ్చారంటూ చేస్తోన్న కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ స్కీమ్ ను సమర్థిస్తూ మాట్లాడిన ఆయన.. దేశ సైన్యాన్ని ఆధునికీకరించడంతో పాటు బలోపేతం చేయడానికి అవసరమైన సంస్కరణ అని నరేంద్ర మోడీ వెల్లడించారు.

Read Also: Kamala Harris vs Donald Trump: చర్చకు రెడీ అంటునన్న కమలాహారిస్‌.. ఇప్పుడే వద్దన్న ట్రంప్‌

కాగా, అంతకు ముందు.. కార్గిల్ యుద్ధానికి సాక్షిగా లద్ధాఖ్ నిలిచిందని ప్రధాని మోడీ తెలిపారు. అమరలు త్యాగాలకు గుర్తుగా ‘విజయ్ దివస్‌’ను జరుపుకుంటున్నాం.. దేశం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన సైనికులు చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు.. ప్రజల గుండెల్లో వారు చిరకాలం గుర్తుండిపోతారని ప్రధాని వెల్లడించారు. ఇక, కార్గిల్ యుద్ధంలో భారత్ విజయకేతనం ఎగురవేసిన సందర్భంగా దేశం అంతా ఇవాళ ‘కార్గిల్ విజయ్ దివస్’‌ను జరుపుకుంటున్నారు. ఈ మేరకు లద్ధాఖ్ ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకం దగ్గర ప్రధానితో పాటు సీడీఎఫ్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ అధిపతి లెఫ్ట్‌నెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో పాటు త్రివిధ దళాలు నివాళులర్పించారు.