ఢిల్లీలో ప్రధాని మోడీని కపూర్ కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మోడీ ఉల్లాసంగా గడిపారు. ఒక్కొక్కరిని పలకరించి విశేషాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కరీనా కపూర్.. ప్రధాని మోడీ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. డిసెంబర్ 14న జరిగే రాజ్‌కపూర్ శత జయంతి ఉత్సవానికి రావాల్సిందిగా కుటుంబ సభ్యులు.. ప్రధాని మోడీని ఆహ్వానించారు. మోడీని కలిసిన వారిలో రణబీర్ కపూర్, అలియా భట్, కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్, కరిష్మా కపూర్, నీతూ కపూర్, రిద్ధిమా కపూర్ సాహ్ని తదితరులు ఉన్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను పీఎంవో సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ వీడియో తాజాగా వైరల్‌గా మారింది.
రాజ్‌కపూర్ ప్రముఖ నిర్మాత, నటుడు. డిసెంబరు 14. 1924లో జన్మించారు. 1988లో రాజ్‌కపూర్ మరణించారు. నటుడు, దర్శకుడు, నిర్మాతగా భారతీయ చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. పద్మ భూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకున్నారు. రాజ్‌కపూర్ జయంతిని దేశవ్యాప్తంగా నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ నెల 13 నుంచి 15 వరకు రాజ్‌కపూర్ శత జయంతిని పురస్కరించుకుని వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆయనకు సంబంధించి బెస్ట్ సినిమాలు 135 థియేటర్లలో ప్రదర్శించనున్నారు. 40 నగరాల్లోని 135 థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ముంబైలో డిసెంబర్ 14న శత జయంతి ఉత్సవం జరగనుంది.
#WATCH | Delhi: Ahead of the 100th birth anniversary of legendary actor-filmmaker Raj Kapoor on December 14, members of the Kapoor family yesterday extended an invitation to Prime Minister Narendra Modi.
Ranbir Kapoor, Alia Bhatt, Kareena Kapoor Khan, Saif Ali Khan, Karisma… pic.twitter.com/tdS89Ecvnm
— ANI (@ANI) December 11, 2024