NTV Telugu Site icon

PM Modi: ఎన్నికల్లో ఓడిపోయాక అద్వానీ, వాజ్‌పేయ్ రాజ్‌కపూర్ సినిమానే చూశారు

Modidelhi

Modidelhi

ఢిల్లీలో ప్రధాని మోడీని కపూర్ కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అంతేకాకుండా ఒక్కొక్కరితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఓ సంఘటనను కపూర్ కుటుంబ సభ్యులతో మోడీ పంచుకున్నారు. జనసంఘ్ హయాంలో ఢిల్లీలో ఎన్నికలు వచ్చాయని.. ఆ ఎన్నికల్లో ఓడిపోయినట్లు తెలిపారు. ఆ సమయంలో ఎల్‌కే అద్వానీ, వాజ్‌పేయ్.. ఎన్నికల్లో ఓడిపోయాం.. ఇప్పుడు ఏం చేద్దామని చర్చింకుంటుండగా.. సినిమా చూద్దాం అనుకున్నారని వెల్లడించారు. వారంతా సినిమా చూడడానికి వెళ్లారన్నారు. అప్పుడు రాజ్‌కపూర్‌కు చెందిన ‘ఫిర్ సుబహ్ హోగీ’ (1958) సినిమా చూశారని గుర్తుచేశారు. అంతేకాకుండా చైనా పర్యటనకు వెళ్లినప్పుడు కూడా రాజ్‌కపూర్ సినిమాల్లోని పాటలనే ప్లే చేసేవారని నెమరవేశారు. ఇలా కుటుంబ సభ్యులతో అనేక విషయాలు మోడీ ముచ్చటించారు. ఇలా కుటుంబ సభ్యులతో ముచ్చటించడం ఆనందంగా ఉందని.. వారందరికీ కృతజ్ఞతలని మోడీ తెలిపారు. అలాగే కపూర్ కుటుంబ సభ్యులు కూడా ప్రధాని మోడీతో ముచ్చటించడంపై ఆనందం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే కరీనా కపూర్.. ప్రధాని మోడీ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. ఇక డిసెంబర్ 14న జరిగే రాజ్‌కపూర్ శత జయంతి ఉత్సవానికి రావాల్సిందిగా కుటుంబ సభ్యులు.. ప్రధాని మోడీని ఆహ్వానించారు. మోడీని కలిసిన వారిలో రణబీర్ కపూర్, అలియా భట్, కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్, కరిష్మా కపూర్, నీతూ కపూర్, రిద్ధిమా కపూర్ సాహ్ని తదితరులు ఉన్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను పీఎంవో సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ వీడియో తాజాగా వైరల్‌గా మారింది.

రాజ్‌కపూర్‌ ప్రముఖ నిర్మాత, నటుడు. డిసెంబరు 14. 1924లో జన్మించారు. 1988లో రాజ్‌కపూర్‌ మరణించారు. నటుడు, దర్శకుడు, నిర్మాతగా భారతీయ చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. పద్మ భూషణ్‌, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులు అందుకున్నారు. రాజ్‌కపూర్‌ జయంతిని దేశవ్యాప్తంగా నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ నెల 13 నుంచి 15 వరకు రాజ్‌కపూర్‌ శత జయంతిని పురస్కరించుకుని వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆయనకు సంబంధించి బెస్ట్ సినిమాలు 135 థియేటర్లలో ప్రదర్శించనున్నారు. 40 నగరాల్లోని 135 థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ముంబైలో డిసెంబర్ 14న శత జయంతి ఉత్సవం జరగనుంది.

 

 

Show comments