NTV Telugu Site icon

Uttar Pradesh: గ్రామస్థులపై నక్క దాడి.. 10 ఏళ్ల బాలుడు సహా ముగ్గురికి గాయాలు

Fox

Fox

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బహ్రైచ్‌లో ఇటీవల తోడేళ్ల దాడి జరిగిన తర్వాత ఇప్పుడు కాన్పూర్ సమీపంలోని గ్రామాల్లో నక్కల దాడులు పెరిగాయి. రెండు వేర్వురు ఘటనల్లో 10 ఏళ్ల బాలుడు సహా అనేక మంది గ్రామస్తులను గాయపడ్డారు. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమైయ్యారు. మంగళవారం సాయంత్రం పొలాల్లో పని చేస్తున్న షాను, రామ్ బహదూర్‌లతో పాటు పదేళ్ల బాలుడిపై నక్క దాడి చేసి గాయపరిచింది. అలాగే, మరో సంఘటనలో బెహత్ సకత్ నివాసి రామ్ కిషోర్ (50)ని కూడా ఈ నక్క గాయపర్చింది అని స్థానికులు తెలిపారు.

Read Also: Gas Leak: రసాయన పరిశ్రమలో గ్యాస్‌ లీక్‌.. అల్లాడుతున్న ప్రజలు..

కాగా, నక్కల దాడులు జరిగినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) పేర్కొన్నారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది అన్నారు. అధిక వర్షపాతంతో ఈ వన్యప్రాణులను వాటి సహజ ఆవాసాల నుంచి స్థానభ్రంశం కోసం సమీపంలోని గ్రామాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆయన సూచించారు. నక్కల దాడిపై జిల్లా యంత్రాంగం బాధిత ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. అయితే, బహ్రైచ్‌లో గత వారం రోజుల క్రితం తోడేళ్ళు 10 మందికి పైగా ప్రాణాలను బలిగొన్నాయి. చాలా మందిని తీవ్రంగా గాయపర్చాయి. ఇక, వీటిని పట్టుకునేందుకు అధికారులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఐదు తోడేళ్లను పట్టుకోగా.. ఆరవ తోడేలు దాడి చేయడంతో ప్రజల్లో మరింత భయం నెలకొంది.