NTV Telugu Site icon

Kiccha Sudeep: బీజేపీలో చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో కిచ్చా సుదీప్‌కు బెదిరింపు లేఖ

Sudeep

Sudeep

Kiccha Sudeep: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోజు బెంగళూర్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో సీఎం బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీజేపీలో చేరుతారనే వార్తల నేపథ్యంలో ఆయనకు బెదిరింపు లేఖ వచ్చింది. దీనిపై కిచ్చా సుదీప్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read Also: Divya Bharti : 14ఏళ్లయినా ప్రేక్షకుల గుండెల్లో చెరగని అందం

నివేదిక ప్రకారం కిచ్చ సుదీప్ మేనేజర్ జాక్ మంజుకి లేఖ వచ్చింది. ఈ లేఖలో సుదీప్ ప్రైవేట్ వీడియోలు విడుదల చేస్తామని బెదిరించారు. లేఖలో అవమానకరంగా, దర్భాషలాడారని తెలిపారు. ఈ విషయాన్ని సుదీప్ దృష్టికి తీసుకెళ్లినట్లు మేనేజర్ వెల్లడించారు. దీనిపై బెంగళూరులోని పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ 120 బి, 506 మరియు 504 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసును సెంట్రల్ క్రైమ్ బ్రాంచుకు బదిలీ చేయాలని సీనియర్ పోలీస్ అధికారులు యోచిస్తున్నారు.

కిచ్చా సుదీప్ తో పాటు మరో స్టార్ హీరో ఛాలెజింగ్ స్టార్ దర్శన్ కూడా బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలు బీజేపీలో చేరుతుండటం కన్నడ రాజకీయాల్లో కీలక పరిణామంగా చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో వీరిద్దరు స్టార్ క్యాంపెనర్లుగా బీజేపీ తరుపున ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ తన అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేసింది. ఏప్రిల్ 8న బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుంది.