Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’
- వాళ్ల సలహాలు తీసుకోవాల్సిన పని లేదు
- తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి తన నోటికి పని చెప్పారు. సహచర బాలీవుడ్ నటులపై ఘాటు వ్యా్ఖ్యలు చేశారు. ఇటీవల యోగా గురువు బాబా రామ్‌దేవ్‌పై తీవ్రంగా స్పందించిన కంగనా.. ఇప్పుడు తోటి నటీనటులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తాప్సీ, అశోతోష్ రాణా, సోనూ సూద్, రాఖీ సావంత్, బాబా రామ్‌దేవ్‌పై కంగనా విరుచుకుపడ్డారు. తన కంటే ఎక్కువ విజయం సాధించిన వారి నుంచే తాను సలహాలు తీసుకుంటాను గానీ.. విఫలమైన వారు, అసహ్యమైన వారి నుంచి సలహాలు తీసుకోను అని వ్యాఖ్యానించారు. తనను విమర్శించే స్థాయి వారికి లేదన్నారు.
Also Read
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
- MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
- LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
‘‘నేను ప్రతిరోజూ ఇలాంటి వాళ్లను చూస్తుంటాను. నేను కుక్కలా మొరుగుతానని చెప్పే అశుతోష్ రాణా అయినా.. నేను ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలని చెప్పే సోనూ సూద్ అయినా.. నా వ్యక్తిత్వం గురించి అన్ని రకాల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసే రాఖీ సావంత్ లాంటి వాళ్లైనా.. నా తల్లిదండ్రులను, నా పెంపకాన్ని, నా నేపథ్యాన్ని నిరంతరం అవమానిస్తూ ఉండే తాప్సీ లాంటి వాళ్లు కూడా ఉన్నారు. ఈ వ్యక్తులకు నేను చెప్పే సందేశం ఒక్కటే.. నా జీవితంలో నేను సాధించిన విజయంలో ఒక్క శాతం కూడా మీరు సాధించకపోతే… నేను మీ సలహాలను అస్సలు వినను. ఈ పనికిమాలిన వ్యక్తులు కేవలం ప్రచారం కోసమే మీడియాలో నన్ను నిరంతరం దూషిస్తూ ఉంటారు.’’ అని దుయ్యబట్టారు.
పనిలో పనిగా మరోసారి బాబా రామ్‌దేవ్‌పై కూడా మండిపడ్డారు. ఆయన అన్ని హద్దులు దాటారని ఆరోపించారు. ‘‘ఈ ఆకలితో ఉన్న.. నిస్సహాయులైన ప్రజలు నాపై విరుచుకుపడలేరు. వారు తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టరు. అశుతోష్ రాణా లాంటి వాళ్లు నేను కుక్కలా మొరుగుతానని అంటారు. ముందు మీరే కంగనా రనౌత్ అవ్వండి. నేను నాకంటే ఎక్కువ విజయం సాధించిన వారి నుంచి సలహాలు తీసుకుంటాను. విఫలమైన, తెలివితక్కువ, అసహ్యకరమైన వ్యక్తుల నుండి నేను సలహాలు తీసుకోను..’’ అని పేర్కొన్నారు.
వివాదం ఇలా..
ఇటీవల ఢిల్లీ వేదికగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అయితే ఈ ఉద్యమంపై కంగనా స్పందిస్తూ.. విద్యార్థులను ‘మురికి తరం’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే తీవ్ర దుమారం రేపాయి. దీనిపై బాబా రామ్‌దేవ్ స్పందిస్తూ.. ‘‘ఆమె గతంలో చేసిన పనులు ఎలా ఉండేవి. ఆమె యవ్వనం ఎలా ఉండేది?, అయినా కలుషితమైన మనస్తత్వం కలిగిన గురించి మాట్లాడను.’’ అని అన్నారు. దీనికి కంగనా కౌంటరిచ్చారు. ‘‘బాబాజీ.. నా యవ్వనం లేదా పడకగది గురించి పగటి కలలు కనకండి. పుకార్లు, గాసిప్‌ల ఆధారంగా మాత్రమే ఊహించుకోవాలి.’’ అని రాశారు.
ఇక తాప్సీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ కంగనాను కలవలేదని.. తన అభిప్రాయం ప్రకారం.. ఆమె మాటలు వింటుంటే.. ఆమె పెంపకంలోనే ఏదో తేడా ఉందని వ్యాఖ్యానించారు. ఇలా కంగనా వర్సెస్ సెలబ్రిటీలు, ప్రముఖల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీనికి ఎప్పుడు పుల్‌స్టాప్ పడుతుందో చూడాలి.
#WATCH दिल्ली: भाजपा सांसद कंगना रनौत ने कहा, “आए दिन इस तरह के लोग चाहे वो आशुतोष राणा हो जो कहते हैं कि कुत्ते की तरह भौंकती है सोनू सूद कहते हैं कि मुझे तरीका सीखना चाहिए, राखी सावंत जो मेरे चरित्र पर भद्दी टिप्पणी करती हैं, तापसी पन्नू जो मेरे माता-पिता को अपमानित करती हैं इन… pic.twitter.com/verwcwDiYA
— ANI_HindiNews (@AHindinews) August 24, 2026
Delhi: BJP MP Kangana Ranaut says, “I see such people every day, whether it is Ashutosh Rana, who says that I bark like a dog; or Sonu Sood, who says that I should learn how to behave. People like Rakhi Sawant, who make all kinds of vulgar comments about my character; and Taapsee… pic.twitter.com/NPlhvTMlI5
— IANS (@ians_india) August 24, 2026
తాజావార్తలు
-
Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
-
Shiva Nirvana: రవన్నతో ఆ సీన్ తీస్తున్నప్పుడు భయపడ్డా.. ‘ఇరుముడి’ అసలు కథ బయటపెట్టిన డైరెక్టర్!
-
Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్‌కు జాక్‌పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
-
YS Jagan: జూనియర్ డాక్టర్ల సమ్మెపై వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
-
CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!