Kangana Ranaut Sensational Post In Instagram Stories: ముక్కుసూటిగా మాట్లాడటమే కాదు.. అప్పుడప్పుడు వివాదాస్పద పోస్టులతో కంగనా రనౌత్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటుంది. ఇప్పుడు మరోసారి ఆమె ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమంగా ఓ షాకింగ్ ఆరోపణ చేసింది. ఆమె నేరుగా నటుడు రణ్‌బీర్ కపూర్ పేరు వెల్లడించలేదు కానీ, పరోక్షంగా అతనిపై నమ్మశక్యం కాని ఆరోపణలు చేసింది. తనపై గూఢచర్య చేస్తున్నారని.. తన ప్రతీ కదలికను గమనిస్తున్నారని పేర్కొంది. తన వ్యక్తిగత, వృత్తిపరమైన సమాచారాన్ని కూడా లీక్ చేస్తున్నారని కుండబద్దలు కొట్టింది.
Chhattisgarh Maoists: బీజేపీ నాయకుడ్ని చంపిన మావోయిస్టులు.. కుటుంబ సభ్యుల ముందే..
‘‘నేను ఎక్కడికెళ్లినా నన్ను అనుసరిస్తున్నారు. నాపై గూఢచర్యం చేస్తున్నారు. వీధుల్లోనే కాదు.. నా బిల్డింగ్ పార్కింగ్, నా ఇంటి టెర్రస్‌లో కూడా నాపై కన్నేసేందుకు జూమ్ లెన్స్‌లు ఏర్పాటు చేశారు. నిజానికి.. ఇలాంటి జూమ్ లెన్సులను నక్షత్రాల్ని చూసేందుకు వినియోగిస్తారని తెలుసు. కానీ, వాళ్లు మాత్రం నాపై నిఘా పెట్టేందుకు వాడుతున్నారు. ఉదయం 6:30 గంటలకే వాళ్లు నా ఫోటోలు తీశారు. అసలు వాళ్లకు నా షెడ్యూల్ గురించి ఎలా తెలుస్తోందో అర్థం కావట్లేదు. అయినా.. నా ఫోటోలు తీసుకొని, వాళ్లు ఏం చేస్తారు? నా వాట్సాప్ డేటా, వృత్తిపరమైన ఒప్పందాలు, వ్యక్తిగత వివరాలు కూడా లీక్ అవుతున్నాయని నేను నమ్ముతున్నా. ఒకప్పుడు అతడు నా ఆహ్వానం లేకుండానే నా ఇంటికొచ్చి, నన్ను బలవంతం చేశాడు. ఇప్పుడు తన భార్యను నిర్మాతగా మారాలని, మరిన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయాలని ఒత్తిడి చేస్తున్నాడు’’ అంటూ కంగనా బాంబ్ పేల్చింది.
Earthquake: టర్కీ, సిరియాలలో భారీ భూకంపం.. 100కి పైగా మృతి
అంతేకాదు.. ఆ ఇద్దరు తన స్టైలిస్ట్, హోమ్ స్టైలిస్ట్‌లను కూడా నియమించుకున్నారని.. తన ఫైనాన్షియర్లు, వ్యాపార భాగస్వాములు ఎలాంటి కారణం లేకుండానే ఒప్పందాలను విరిమించుకున్నారని కంగనా వాపోయింది. అతడు తనని ఒంటరిని చేసి, మానసిక ఒత్తిడికి గురి చేయడానికి ప్రయత్నిస్తున్నాడని తాను భావిస్తున్నానని పేర్కొంది. ఆ ఇద్దరు ఒకే భవనంలోనే విడివిడిగా నివసిస్తున్నారని, ఇందుకు అతని భార్య వ్యతిరేకించాలని తాను చెప్పాలనుకుంటున్నానని, అతనిపై ఓ కన్నేసి ఉంచాలని కూడా సూచించాలనుకుంటున్నానని కంగనా వెల్లడించింది. ఒకవేళ అతడు ఇబ్బందుల్లో పడితే.. అతని భార్యతో పాటు ఆమె బిడ్డ కూడా ఇబ్బందుల్లో పడతారని కుండబద్దలు కొట్టింది. ఇలా జరగకుండా ఉండాలంటే.. ఆమె తన జీవితానికి బాధ్యత వహించిన చట్టవిరుద్ధమైన పనుల్లో పాల్గొనకుండా చూడాలని కంగనా హెచ్చరించింది.
Girl Bites Man Lips: అత్యాచారయత్నం.. తెగేలా పెదవి కొరికి, బుద్ధి చెప్పిన యువతి
కాగా.. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ బాంద్రాలో ఒకే అపార్ట్‌మెంట్‌లో రెండు వేర్వేరు అంతస్తుల్లో, వేర్వేరు ఫ్లాట్‌లలో నివసిస్తున్నారు. పైగా వీరికి 2022 నవంబర్‌లో ఒక బిడ్డ కూడా జన్మించింది. దీంతో.. కంగనా పెట్టిన పోస్టులో పరోక్షంగా ఆలియా, రణ్‌బీర్‌లనే టార్గెట్ చేసినట్టు స్పష్టమవుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కంగనా పేర్కొన్న ఆ మిస్టరీ మ్యాన్ రణ్‌బీర్ కపూర్ అంటూ భావిస్తున్నారు. అయినా.. రణ్‌బీర్ లాంటి స్టార్ హీరోకి కంగనాపై గూఢచర్యం చేయాల్సిన అవసరం ఏంటి?