Kangana Ranaut: బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి ‘‘బాలీవుడ్’’పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లో పాకిస్తాన్‌పై ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షాతో ఆమె మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోసారి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌పై బాలీవుడ్‌లో కొందరు సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు చూపుతున్న ఆసక్తి అతిగా ఉందని ఆరోపించారు. బాలీవుడ్ సినిమాలు, ఇంటర్వ్యూల్లో పాకిస్తాన్ అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. ‘‘ పాకిస్తాన్ ప్రేమకథ ఎప్పుడు ముగుస్తుంది? ఎప్పుడు చూసిన పాక్ ప్రేమ లోనే మునిగిపోతున్నారు’’ అని ఆమె అన్నారు. విభజన జరిగి ఇన్ని ఏళ్లయినా పాకిస్తాన్ అంశంపై బాలీవుడ్ ఆసక్తి ఎందుకు కొనసాగుతోందని ఆమె ప్రశ్నించారు.
మరోవైపు, నసీరుద్దీన్ షాపై కంగనా సంచలన వ్యాఖ్యలు చేశారు. అతడిని నక్కతో పోల్చారు. నక్కలా ఉండేకన్నా కుక్కగా ఉండటం బెటర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుక్కు విశ్వాసం, విధేయత ఉంటాయని అన్నారు. ఆయన ఈ దేశం అన్నం తింటూ పాకిస్తాన్ భజన చేస్తారని మండిపడుతున్నారు. బాలీవుడ్ ఎంపిక చేసిన అంశాలపై మాత్రమే స్పందిస్తోందన విమర్శించారు. జార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళనపై నీట్ వ్యవహారంపై స్పందించిన బాలీవుడ్ సెలబ్రిటీలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

