Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanchipuram Horror: తీసుకున్న అప్పు తీరే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదంటూ బాలింతను నిర్బంధించడం.. ఆ తర్వాత పురిటినొప్పులతో తల్లడిల్లిన ఆ తల్లి.. గుడారంలోనే ప్రాణాలు విడిచిన ఘటన తమిళనాడులో తీవ్ర కలకలం రేపుతోంది.. కాంచీపురం జిల్లాలో అప్పు పేరుతో సాగిన అమానుషం ఓ బాలింత, పసికందు ప్రాణాలను బలిగొంది. సింగడివాక్కంకు చెందిన ఆనందన్, తేనెమొళి దంపతులు చెట్లు నరికే పనికి వెళ్లి.. యజమాని ఆరుముగం వద్ద రూ.20 వేల అప్పు తీసుకున్నారు. అప్పు తీరే వరకు తన గుడారం వద్దే ఉండాలంటూ యజమాని ఆంక్షలు విధించాడు. ఈ క్రమంలో తేనెమొళికి పురిటి నొప్పులు వచ్చినా ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతించలేదని ఆరోపణలు ఉన్నాయి. చివరకు గుడారంలోనే ప్రసవం ప్రారంభమై.. బిడ్డ సగం బయటకు వచ్చిన సమయంలో తీవ్ర రక్తస్రావం జరిగింది. వైద్యం అందక తేనెమొళి, పసికందు మృతి చెందారు. ఘటనపై పొన్నేరికరై పోలీసులు కేసు నమోదు చేసి యజమాని ఆరుముగంను అదుపులోకి తీసుకున్నారు. అప్పు పేరుతో దంపతులను బానిసలుగా పనిచేయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ ఘటనపై డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
- Antivenom: ఇక డోంట్ వర్నీ.. పామువిషానికి చెక్ పెట్టే సరికొత్త యాంటీవెనమ్ వచ్చేసింది!
- BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీకి చేరుకున్న పుతిన్.. నేడు మోడీతో కీలక భేటీ
- Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
-
Logitech MX Keypad: రూ.15,999కే Logitech MX Keypad.. 9 కస్టమైజబుల్ LCD కీస్, AI టూల్స్‌కు సపోర్ట్
-
Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
-
Varun Tej Son: కొడుకు వాయువ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్‌నెస్‌కు ఫ్యాన్స్ ఫిదా!
-
Antivenom: ఇక డోంట్ వర్నీ.. పామువిషానికి చెక్ పెట్టే సరికొత్త యాంటీవెనమ్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!