Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Jyoti Malhotra As Kerala Tourism Influencer Reveals Rti

Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రాకు కేరళ సర్కార్ రాచమర్యాదలు.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి!

Published Date :July 7, 2025 , 1:24 pm
By Suresh Maddala
  • జ్యోతి మల్హోత్రాకు కేరళ సర్కార్ రాచమర్యాదలు
  • ఆర్టీఐ ద్వారా వెలుగులోకి!
  • ఆమె గూఢచారి అని ముందు తెలియదన్న మంత్రి
Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రాకు కేరళ సర్కార్ రాచమర్యాదలు.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

పాకిస్థాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన వార్త మరోసారి జాతీయ స్థాయిలో రచ్చ చేస్తోంది. కేరళ రాష్ట్రంలో ఆమెకు రాచమర్యాదలు జరిగినట్లుగా తాజాగా ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. కేరళను ప్రపంచ పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించడానికి ఎంపిక చేసిన 41 మంది ప్రభావశీలుల జాబితాలో జ్యోతి కూడా ఉండడం విశేషం. కేరళ ప్రభుత్వం ఆమెకు నిధులు సమకూర్చినట్లుగా ఆర్టీఐ విచారణలో వెల్లడైంది.

ఇది కూడా చదవండి: PuriSethupathi : పూరి – సేతుపతి.. షూటింగ్ స్టార్ట్

పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమె పాకిస్థాన్‌కు గూఢచర్యగా పని చేసినట్లుగా గుర్తించారు. పాకిస్థాన్ అధికారులతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగినట్లుగా కనిపెట్టారు. అంతేకాకుండా వాళ్ల మద్దతుతో మూడు సార్లు పాకిస్థాన్‌ను కూడా చుట్టివచ్చింది. అక్కడ ప్రత్యేక ఏర్పాటు కూడా చేశారు. ఇక తాజాగా ఆమెకు సంబంధించిన వార్త కలకలం రేపుతోంది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు కేరళ ప్రభుత్వం 41 మంది ఇన్‌ఫ్లుయెన్లర్లను నియమించుకుంది. అందులో జ్యోతి మల్హోత్రాను కూడా ఎంపిక చేసి ఆమెకు ట్రావెల్, భోజన వసతులు కల్పించింది. వీడియోలు తీసుకునేందుకు ఆమెకు ప్రత్యేక మనుషులను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సమాచార హక్కు చట్టం కింద ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: Ramayana: రాముడి పాత్ర కోసం.. రణబీర్ భారీ త్యాగం..!

తాజాగా ఈ వ్యవహారంపై రచ్చ రేపుతోంది. ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి. పరిశీలన లేకుండా ఒక విదేశీ గూఢచారిని ఎలా నియమించుకుంటారని ఆరోపించాయి. ఇక ప్రతిపక్షాల విమర్శలపై కేరళ పర్యాటక మంత్రి పీఏ మహమ్మద్ రియాస్ స్పందించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇతర ఇన్‌ఫ్లుయెన్లర్లతో పాటు జ్యోతిని కూడా ఆహ్వానించినట్లు చెప్పారు. ఇది కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతోనే చేసిన ప్రయత్నమన్నారు. మంచి ఉద్దేశంతో చేసిన కార్యక్రమమని.. కానీ ఆమె గూఢచారి అని ముందుగా తెలుసుకోవడం ఎవరికీ సాధ్యపడదన్నారు.

జ్యోతి మల్హోత్రా… కేరళలో కొచ్చి, కన్నూర్, కోజికోడ్, అలప్పుజ, మున్నార్, తిరువనంతపురం ప్రాంతాలను సందర్శించింది. ఈ వీడియోలను తన యూట్యూబ్‌ ఛానల్‌తో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్లో షేర్ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత మే నెలలో ఆమెను అరెస్టు చేశారు. పహల్గామ్‌ ఉగ్రదాడికి ముందు జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌ను సందర్శించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • danish
  • Jyoti Malhotra
  • Kerala Tourism Influencer
  • Pakistan
  • RTI

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions