NTV Telugu Site icon

India-Canada Row: వెనక్కి తగ్గిన కెనడా.. మేం అసలు మోడీ, జైశంకర్‌ పేర్లను చెప్పలేదని వెల్లడి

Ind Vs Canada

Ind Vs Canada

India-Canada Row: ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య కేసులో భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా మీడియాలో ఓ కథనం ప్రచురితమైంది. అందులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరును ప్రస్తావించడంపై న్యూ ఢిల్లీ తీవ్రంగా మండిపడింది. దీంతో కెనడా తాజాగా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుంది. ఆ కథనాలు అవాస్తవమని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఒట్టావా ఓ ప్రకటన రిలీజ్ చేసింది.

Read Also: East Godavari: కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. తీరనున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజల కష్టాలు

కాగా, ప్రజల భద్రతకు ముప్పు పొంచి ఉన్నప్పటికి అక్టోబర్ 14వ తేదీన రాయల్‌ కెనడియన్‌ అధికారులు తీవ్ర ఆరోపణలు చేశారు. భారత ప్రభుత్వానికి చెందిన ఏజెంట్లు తమ గడ్డపై పాల్పడుతున్న నేర కార్యకలాపాలకు సంబంధించి బహిరంగ ప్రకటనలు రిలీజ్ చేశారు. అయితే, తాజాగా ఈ అంశంపై కెనడా సర్కార్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుంది. ఈ సందర్భంగా నేర కార్యకలాపాలకు మోడీ, జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్‌తో సంబంధం ఉన్నట్లు తాము ఏ రోజు చెప్పలేదు.. దీనికి భిన్నంగా ఎలాంటి వార్తలు ప్రచురితమైనా అవన్నీ అసత్యమైనవేనని కెనడా సర్కార్ ప్రకటించింది.