NTV Telugu Site icon

Court: భార్యకు రూ2లక్షల మధ్యంతర భృతి ఇవ్వాలని తీర్పు.. భర్త ఏం చేశాడంటే..!

Coins

Coins

తమిళనాడు న్యాయస్థానంలో వింతైన సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి నాణేలతో కోర్టుకు హాజరయ్యాడు. ఈ పరిణామంతో న్యాయమూర్తి అవాక్కయ్యారు. భరణం చెల్లించేందుకు నాణేలతో రావడంతో షాక్ అయ్యారు. అసలేం జరిగింది. నాణేలతో కోర్టుకు ఎందుకు హాజరయ్యాడో తెలియాలంటే ఈ వార్త చదవండి.

ఇది కూడా చదవండి: KTR Case: హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట..

కోయంబత్తూరుకు చెందిన ఓ వ్యక్తి (37). వాడవల్లి ప్రాంతంలో టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే దంపతుల మధ్య ఏం గొడవలు ఉన్నాయో.. ఏమో తెలియదు గానీ.. ఆయన భార్య గతేడాది ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ వేసింది. అయితే ఈ కేసును విచారించిన న్యాయమూర్తి… ప్రతివాదికి మధ్యంతర భరణంగా రూ.2 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. అయితే భార్య మీద కోపమో.. ఇంకేదో తెలియదు గానీ.. భర్త ఈనెల 18న (బుధవారం) ఫ్యామిలీ కోర్టుకు రూ.1, రూ.2 నాణేలతో హాజరయ్యాడు. రూ.80,000 విలువైన నాణేలతో మొత్తం 20 సంచుల్లో జడ్జి ముందుకు తీసుకొచ్చాడు. చిల్లర డబ్బులు తీసుకురావడంతో ఒక్కసారిగా న్యాయమూర్తి అవాక్కయ్యారు. చిల్లర పైసలు చూసి షాక్ అయ్యారు. దీంతో అతడిని న్యాయమూర్తి మందలించారు. చిల్లర డబ్బులు తీసుకెళ్లి.. నోట్లు తీసుకురావాలని ఆదేశించారు. దీంతో అతడు తిరిగి 20 సంచులను కారులో పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.