NTV Telugu Site icon

One Nation One Election: జమిలిపై జేపీసీ కమిటీ ఏర్పాటు.. ప్రియాంకాగాంధీకి చోటు

Jpc

Jpc

వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం కేంద్రం జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసింది. లోక్‌సభ నుంచి 21 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులను నియమించింది. మొత్తం 31 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ప్రియాంక గాంధీ వాద్రా, మనీష్ తివారీ, ధర్మేంద్ర యాదవ్, కళ్యాణ్ బెనర్జీ, సుప్రియా సూలే, శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే, సంబిత్ పాత్ర, అనిల్ బలూని, అనురాగ్ సింగ్ ఠాకూర్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి పీపీ చౌదరి ఛైర్మన్‌గా నియమించారు. నివేదికను తదుపరి పార్లమెంట్ సమావేశాల్లో సమర్పించాలని కేంద్రం సూచించింది.

Show comments