Site icon NTV Telugu

JP Nadda: ఏపీ-తెలంగాణలో నూతన బీజేపీ ఆఫీస్‌.. వర్చువల్ ద్వారా ప్రారంభించనున్న జేపీ నడ్డా

Jp Nadda

Jp Nadda

JP Nadda: నేడు సంగారెడ్డి లోని నూతన బీజేపీ కార్యలయాన్ని ఢిల్లీ నుండి వర్చువల్ ద్వారా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. మధ్నాహ్నం ఢిల్లీ నుంచి వర్చువల్ గా సంగారెడ్డి, భూపాలపల్లి, వరంగల్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ తో పాటు ఏపీలోని అనంతపురం, చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడి నుంచే కార్యకర్తలను ఉద్దేశించి నడ్డా ప్రసంగించనున్నారు. సంగారెడ్డి జిల్లా కందిలో జరిగే పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి జి. కిష న్రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ హాజరుకానున్నారు.

Read also: MLA vs MLC: పండుగపూట డీజేసౌండ్స్ తో మారుమోగిన తిరుమలగిరి.. పోటా పోటీగా బీజేపీ, కాంగ్రెస్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌ పర్యటన రద్దయింది. మార్చి 31న జేపీ నడ్డా సంగారెడ్డి జిల్లా పార్టీ ఆఫీసును ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని జేపీ నడ్డా ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు. జేపీ నడ్డా పర్యటనలో స్వల్ఫ మార్పు జరిగినట్లు తెలంగాణ బీజేపీ నేతలు వెల్లడించారు. ఢిల్లీ నుండే నేరుగా వర్చువల్ ద్వారా సంగారెడ్డి కార్యాలయం ప్రారంభించనున్నట్లు తెలిపారు. అక్కడి నుండే కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించిన విషయం తెలిసిందే.
Helicopters Crash : ఆర్మీ హెలికాప్టర్స్ ఢీ.. 9 మంది దుర్మరణం

Exit mobile version