NTV Telugu Site icon

JP Nadda: మోడీని తిట్టడం, విదేశాల్లో భారత్‌ను చులకన చేయడం కాంగ్రెస్ మానుకోవాలి..

Nadda

Nadda

JP Nadda: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంగా కాంగ్రెస్- బీజేపీల మధ్య వివాదం ముదురుతుంది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నేతలు రాహుల్ ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ రెండు రోజుల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ఇక, నిన్న రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ తుగ్లక్ రోడ్ లోని పోలీస్ స్టేషన్లో ఏఐసీసీ ముఖ్యనేత అజయ్ మాకేన్ కంప్లైంట్ ఇచ్చారు. కాగా, ఇవాళ ప్రధాన మంత్రి మోడీకి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే రాసిన లేఖకు కౌంటర్ గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మరో లేఖ రాశారు.

Read Also: Sand Online Booking: ఆన్‌లైన్‌లో ఉచిత ఇసుక బుకింగ్.. ఇక అన్నీ పోర్ట్‌లోనే..!

ఇక, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా రాసిన లేఖలో మోడీని విమర్శిస్తే మల్లికార్జున ఖర్గే ఎందుకు మాట్లాడ్డం లేదు అని ప్రశ్నించారు. విదేశాల్లో భారత్‌ను చులకన చేయడం మానుకోవాలి.. మోడీ తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టకుండా దుర్భాషలాడారు.. ఆ సందర్భాల్లో ఏఐసీసీ అధినేత ఖర్గే ఎందుకు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. పాకిస్తాన్ అనుకూల – భారత వ్యతిరేక శక్తుల మద్దతు రాహుల్ కూడగడుతున్నారు.. దేశంలో కుల రాజకీయాలను రాహుల్ రెచ్చగొడుతున్నారు ఆని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు గర్వపడుతుంది?.. పొలిటికల్ కరెక్టునెస్, డిగ్నిటీ, క్రమశిక్షణ, మర్యాద లాంటి పదాలు మీ కాంగ్రెస్ డిక్షనరీలో ఎందుకు మాయమైతున్నాయి.. దేశ ప్రయోజనాల కోసం పని చేయడానికి మీకు జ్ఞానం, శక్తిని ఇవ్వాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ జేపీ నడ్డా అన్నారు.