NTV Telugu Site icon

PM Modi: బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఓట్ల కోసం హేమంత్ సర్కార్ బిజీగా ఉంది

Pmmodi

Pmmodi

జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్‌ ప్రభుత్వంపై ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ప్రధాని మోడీ గర్వాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిపై మోడీ నిప్పులు చెరిగారు. బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఓట్ల కోసం ఇండియా కూటమి బిజీగా ఉందని ఆరోపించారు. ‘‘గుష్పైథియా బంధన్ (చొరబాటుదారుల కూటమి)’’గా మారిందని పేర్కొన్నారు. చొరబాటుదారులతో సామాజిక నిర్మాణానికి ముప్పు అని చెప్పారు. పాఠశాలల్లో సరస్వతి వందనాన్ని అడ్డుకున్నారంటే.. రాష్ట్రంలో ముప్పు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. బుజ్జగింపులే హేమంత్ సోరెన్ ప్రభుత్వ ప్రధాన అజెండా అని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Nithiin: శివరాత్రికి తమ్ముడు దిగుతున్నాడు!

బంగ్లాదేశ్‌చొరబాటుదారులు జార్ఖండ్‌ వ్యాప్తంగా విస్తరిస్తున్నారన్నారు. వారి ఓట్లను పొందడానికి ప్రభుత్వం మద్దతుదారులుగా వ్యవహరిస్తోందని వివరించారు. సరస్వతీ వందనను(సరస్వతి గేయం) పాఠశాలలో ఆలపించేందుకు అనుమతించకపోడం ఎంత పెద్ద ప్రమాదమో ఊహించుకోవాలన్నారు. పండుగల సమయంలో రాళ్ల దాడి జరిగినప్పుడు, కర్ఫ్యూ విధించడం, దుర్గమ్మను ఆపడం అది ఎంత ప్రమాదకరమో మీకు తెలుసు అన్నారు. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీల దుష్ట విధానాలు ఇలాగే కొనసాగితే జార్ఖండ్‌లో ఆదివాసీ సమాజం కుంచించుకుపోతుందని వివరించారు. చొరబాటు కూటమిని నిర్మూలించడానికి మీ ఓటును ఉపయోగించాలని పిలుపునిచ్చారు. కేంద్ర పథకాలను అమలు చేసే ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటేనే జార్ఖండ్‌లో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని మోడీ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: World War 3 : జ్యోతిష్యం నిజమవుతుందా..? మూడో ప్రపంచ యుద్ధమేనా..!?

జార్ఖండ్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 13, 20 తేదీల్లో ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి పోటాపోటీగా తలపడుతున్నాయి. ఓటర్లు ఈసారి అధికారం ఎవరికి కట్టబెడతారో వేచి చూడాలి.

 

Show comments