physically assaults young woman in Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భర్త కళ్లముందే భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని పాలము జిల్లాలో జరిగింది. అత్తామామలతో గొడవ పెట్టుకుని.. తల్లిదండ్రుల ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆరుగురు వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే..ఈ అత్యాచార ఘటన సత్బర్వా పోలీస్ స్టేషన్ పరిదిలోని బకోరియా భలువాహీ వ్యాలీ సమీపంలో జరిగిందని జిల్లా ఎస్పీ చందన్ కుమార్ సిన్హా వెల్లడించారు. పాలము జిల్లా పటాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 22 ఏళ్ల యువతి తన అత్తామామలతో గొడవ పడి శనివారం కాలినడకన పక్కనే ఉన్న లతేహార్ జిల్లాలోని మానిక పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని తన తండ్రి ఇంటికి బయలుదేరింది.
Read Also: IT Firm Cheating Case: బోర్డు తిప్పేసిన కంపెనీ.. ఉద్యోగాల పేరుతో భారీ మోసం
భార్య కోసం భర్త మరో బంధువుతో కలిసి మోటర్ సైకిల్ పై వెతకడం ప్రారంభించారు. ఆమెను రాత్రి 8 గంటల సమయంలో సత్బర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 39పై నడుచుకుంటూ వెళ్తున్న విషయాన్ని గుర్తించిన భర్త.. ఆమెను బుజ్జగించి ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే ఆ సమయంలో బైకులపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు భర్తను, అతని బంధువును తీవ్రంగా కొట్టి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భర్త కళ్లెదుటే ఆరుగురు వ్యక్తులు భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆరుగురు నిందితుల్లో ఇద్దరు వ్యక్తులను బాధితురాలి భర్త గుర్తించాడు.
ఈ ఘటన తర్వాత బాధితురాలిని నిందితులు వేరే ప్రాంతానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో బాధిత యువతి గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో గ్రామస్తులు వచ్చిన యువతిని రక్షించారు. ఇద్దరు నిందితులను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ఆరుగురి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మేదినీనగర్ మెడికల్ కాలేజీలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని.. సత్బర్వా పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ రిషికేస్ కుమార్ రాయ్ వెల్లడించారు.
