physically assaults young woman in Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భర్త కళ్లముందే భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని పాలము జిల్లాలో జరిగింది. అత్తామామలతో గొడవ పెట్టుకుని.. తల్లిదండ్రుల ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.