NTV Telugu Site icon

Jharkhand Liquor Scam: జార్ఖండ్లో మద్యం కుంభకోణం.. ఏడుగురిపై ఆరోపణలు..!

Jharkhand

Jharkhand

Jharkhand Liquor Scam: జార్ఖండ్‌లో మద్యం కుంభకోణం మొత్తం కుట్ర రాయ్‌పూర్‌లో జరిగినట్లు తేలింది. రాయ్‌పూర్‌లోని ఎకనామిక్ అఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (EOW) తన ఎఫ్‌ఐఆర్‌లో ఈ స్కామ్ గురించి ప్రస్తావించింది. ఈఓడబ్ల్యూ తన ఎఫ్‌ఐఆర్‌లో అన్వర్ ధేబర్, ఏపీ త్రిపాఠి, అనిల్ తుతేజా, అరవింద్ సింగ్‌తో సహా ఏడుగురిపై ఆరోపణలు చేసింది. వారిపై మోసం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపింది. నిందితుల్లో జార్ఖండ్‌లోని ఎక్సైజ్ శాఖకు చెందిన ఇద్దరు అధికారుల పేర్లు కూడా ఉన్నాయి.

Read Also: MLA Pulivarthi Nani: వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటన.. ఎమ్మెల్యే పులివర్తి నాని హాట్‌ కామెంట్స్‌

అయితే, ఈఓడబ్ల్యూ తెలిపిన ప్రకారం.. డిసెంబర్ 2022లో జార్ఖండ్ మద్యం పాలసీ టెండర్‌లో మార్పులు చేయబడ్డాయని చెప్పుకొచ్చింది. రాయ్‌పూర్‌లోని అన్వర్ ధేబర్ రహస్య స్థలంలో జరిగిన ఈ సమావేశానికి ఏపీ త్రిపాఠి, అనిల్ తుతేజా, అరవింద్ సింగ్, జార్ఖండ్ ఎక్సైజ్ అధికారులు హాజరయ్యారు. సుమిత్ కంపెనీకి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసింది.. దీని వల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని ఎకనామిక్ అఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చెప్పుకొచ్చింది. అలాగే, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ సర్కార్ హయాంలో నకిలీ హాలోగ్రామ్‌లు వేసి రాష్ట్రవ్యాప్తంగా మద్యం సరఫరా చేయగా.. ఇప్పుడు జార్ఖండ్‌లో కూడా అలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చిందని పేర్కొనింది. ఈ స్కాం వల్ల ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లుతుందని ఈఓడబ్ల్యూ అధికారులు అంచనా వేస్తున్నారు.

Read Also: Yamaha : కేవలం రూ. 2,999కట్టి ఈ కంపెనీ టూవీలర్స్‌ ఇంటికి పట్టుకెళ్లండి!

కాగా, ఒక కంపెనీకి ప్రయోజనం చేకూర్చడానికి రూ.11 కోట్ల భద్రతా నిధిని కేటాయించిందని ఈఓడబ్ల్యూ తెలిపింది. దీంతో పాటు ఒక ఉద్యోగి అవసరాన్ని కూడా తీర్చిందని చెప్పుకొచ్చింది. ఇక, 6 నెలల్లో రూ.200 కోట్ల టర్నోవర్‌ సాధించాల్సి వచ్చింది.. ఆ సమయంలో టెండర్ ప్రక్రియలో భాగమైన మద్యం హోల్‌సేల్ టెండర్‌లో పాల్గొన్నందుకు రూ.25 లక్షలు నాన్‌రిఫండబుల్‌గా నిర్ణయించారని పేర్కొనింది. లిక్కర్ స్కామ్ పై జార్ఖండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ స్పందించారు. గతంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మద్యం మాఫియాలు ఈ కుంభకోణానికి పాల్పడ్డాయని.. అయితే ఈసారి పంజాబ్, హర్యానాల నుంచి లిక్కర్ మాఫియాలను రప్పించేందుకు జార్ఖండ్ సర్కార్ ప్లాన్ చేస్తుందన్నారు. అలాగే, బిర్సా ముండా జైలు నుంచే ఈ స్కామ్‌కు స్క్రిప్ట్‌ రాస్తున్నారని జార్ఖండ్ బీజేపీ చీఫ్ ఆరోపించారు.