NTV Telugu Site icon

Jharkhand: సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితులపై ఈడీ రైడ్స్..

Ed

Ed

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితుల ఇంట్లో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) దాడులు నిర్వహిస్తోంది. సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితుడు ఎమ్మెల్యే పంకజ్ మిశ్రా నివాసాలపై దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు 18 ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తోంది. పంకజ్ మిశ్రాకు సన్నిహితుడైనా హీరా భగత్ ఇంట్లో జరిగిన తనిఖీల్లో ఏకంగా రూ.2 కోట్లను స్వాధీనం చేసుకుంది ఈడీ.

Read Also: Ponniyan Selvan: అలరిస్తోన్న మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ టీజర్!

టోల్ ప్లాజా టెండర్ స్కామ్ లో ఈడీ సాహెబ్ గంజ్, బెర్హత్, రాజ్ మహాల్ తో సహా 18 ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తోంది. పంకజ్ మిశ్రాపై మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈ దాడులు చేస్తొంది. ఈడీ రైడ్స్ సమయంలో పారామిలిటరీ బలగాల సాయం తీసుకుంది ఈడీ. దీంతో పాటు పంకజ్ మిశ్రా సన్నిహితులైన వ్యక్తుల ఇళ్లలో కూడా సోదాలు చేపట్టింది. దీంట్లో భాగంగానే పంకజ్ మిశ్రా సన్నిహితుడి ఇంట్లో నుంచి రూ. 2 కోట్లను స్వాధీనం చేసుకుంది. సోరెన్ ప్రభుత్వంలో పంకజ్ మిశ్రా కీలకంగా ఉన్నారు. సీఎం హేమంత్ సోరెన్ కు సంబంధించి సంతాల్ గనులను పంకజ్ మిశ్రానే నిర్వహిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈడీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.