Ponniyan Selvan: అలరిస్తోన్న మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ టీజర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం మనదేశంలో ఏ కాస్ట్యూమ్ డ్రామా తెరకెక్కినా, దానిని రాజమౌళి ‘బాహుబలి’తో పోల్చడం సర్వ సాధారణమై పోయింది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించిన అత్యంత భారీ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ మొదటి భాగం టీజర్ శుక్రవారం సాయంత్రం విడుదలయింది. ఇందులోని సీన్స్ చూడగానే, అప్పుడే ‘బాహుబలి’తో పోల్చడం సాగుతోంది. రాజమౌళి జానపద చిత్రంతో జనాన్ని మెప్పిస్తే, మణిరత్నం చారిత్రకంతో ‘పొన్నియన్ సెల్వన్’ను రూపొందించారు. ఈ సెప్టెంబర్ లోనే ఈ భారీ చారిత్రక చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 1950లలో కల్కి కృష్ణమూర్తి కలం నుండి జాలువారిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఈ చిత్రానికి ఆధారం!
‘పొన్నియన్ సెల్వన్’ ట్రైలర్ లో విక్రమ్, కార్తి, జయం రవి, జయరామ్, పార్తిబన్, ప్రకాశ్ రాజ్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష తదితరులు దర్శనమిస్తారు. ఆరంభంలోనే సముద్రంలో వస్తున్న నౌకలు కనిపించి, భారీతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇక విక్రమ్ పాత్ర “ఈ రక్తం, పాట, వేట అన్నీ మరచిపోవడానికి..గతాన్ని మరచిపోవడానికి.. ఆమెను మరచిపోవడానికి.. నన్ను నేనే మరచిపోవడానికి..” అంటూ కేకలు వేస్తూ కనిపిస్తుంది. దీనిని బట్టి ఈ తొలి భాగంలో ప్రేమకథ ప్రధానంగా ఉంటుందని తెలుస్తోంది. టీజర్ ఆరంభంలోనే “ఛోళాస్ ఆర్ కమింగ్” అంటూ ప్రకటించారు. మరి ఈ ఛోళులు జనాన్ని ఏ తీరున అలరిస్తారో సెప్టెంబర్ 30న తేలనుంది.
Also Read
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
- Ak 47 : 'ఆదర్శ కుటుంబం' చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
తాజావార్తలు
-
WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
-
Zomato: ఫుడ్ లవర్స్‌కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
-
Ponguleti Srinivas Reddy : రాజీనామా చేయాల్సింది నేనా.. కేసీఆర్నా? పొంగులేటి ఫైర్
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!