NTV Telugu Site icon

Jharkhand Floor Test: నేడు జార్ఖండ్ అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్.. మెజార్టీ నిరూపించుకోనున్న సీఎం హేమంత్

Jarkkkhand

Jarkkkhand

Jharkhand Floor Test: ఇవాళ జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంది. గవర్నర్ ఆమోదం తర్వాత స్పీకర్ రవీంద్రనాథ్ మహతో సమావేశానికి పిలిపించారు. ఈ సందర్భంగా పార్టీ, విపక్షాల మధ్య చర్చ తర్వాత విశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. 44 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు లేఖను హేమంత్ సోరెన్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు సమర్పించారు. ఆయనకు జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, ఆర్‌జేడీ, సీపీఐ(ఎంఎల్) సపోర్టు ఉంది. అయితే, ప్రతిపక్షానికి తగిన సంఖ్యా బలం లేకపోవడంతో.. మెజారిటీ పరీక్ష సమయంలో ఎటువంటి అడ్డంకులు ఉండబోవని అధికారా పార్టీ నేతలు అనుకుంటున్నారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి ముందు ఆదివారం జరిగిన జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం సోరెన్ వ్యూహ రచన చేశారు.

Read Also: Rahul Dravid Bharat Ratna: ఎన్నో అద్భుతాలు సృష్టించాడు.. ద్రవిడ్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలి: సన్నీ

కాగా, సంఘీభావం తెలుపుతూ విపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇవ్వాలని జార్ఖండ్ ముక్తి మోర్చా నిర్ణయించింది. ఈ సెషన్‌లో అధికార పార్టీ భారతీయ జనతా పార్టీని టార్గెట్‌ చేయనుంది. సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత ఐదు నెలల పాటు జైలు జీవితం గడిపారు. అయితే, జూన్ 28న జార్ఖండ్ హైకోర్టు జస్టిస్ ఆర్ ముఖోపాధ్యాయ సింగిల్ బెంచ్ హేమంత్ సోరెన్ కు బెయిల్ మంజూరు చేస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. హేమంత్ సోరెన్‌కు వ్యతిరేకంగా ఈడీ దగ్గర తగిన ఆధారాలు లేకపోవడంతో బెయిల్ ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అదే రోజు హేమంత్ సోరెన్ జైలు నుంచి బయటకు వచ్చారు. తనపై తీసుకున్న చర్యలను రాజకీయ కుట్రలో భాగంగానే అతడు అభివర్ణించారు.అఎటువంటి పరిస్థితిలో.. జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీలో తన ప్రసంగంలో.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించే అవకాశం ఉంది.

Read Also: Balkampet Yellamma: రేపు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. ఆలయం వద్ద ఆంక్షలు..

అయితే, ఇవాళ (సోమవారం) ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మంత్రివర్గాన్ని కూడా విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుత మంత్రివర్గంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు అనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. జేఎంఎం కోటా నుంచి బైద్యనాథ్ రామ్‌ను చేర్చే అంశంపై చర్చ కొనసాగుతుంది. కాగా, కాంగ్రెస్‌కు చెందిన డాక్టర్ ఇర్ఫాన్ అన్సారీ మంత్రి కావడం ఖాయంగా కనిపిస్తుంది. అలంగీర్ ఆలం రాజీనామా కారణంగా ఖాళీ అయిన సీటులో ఆయనకు స్థానం కల్పించనున్నారు. కాంగ్రెస్ కోటాలో ఇతర మంత్రులకు మళ్లీ చోటు దక్కవచ్చు అనే ప్రచారం కూడా జరుగుతుంది.