NTV Telugu Site icon

H1B visa: భారత్కు బైడెన్ సర్కార్ గుడ్న్యూస్ .. ఎఫ్-1 వీసాలను హెచ్‌-1బీగా మార్చుకొనే ఛాన్స్

Us Visa

Us Visa

H1B visa: అమెరికాలో ఉద్యోగాలు చేయాలని చూస్తు్న్న వారికి జో బైడెన్‌ శుభవార్త చెప్పారు. మరింత తేలిగ్గా విదేశీయులను నియమించుకునేందుకు యూఎస్ కంపెనీలకు అవకాశం కల్పిస్తూ మార్పులు చేసింది. దీంతో పాటు ఈజీగా ఎఫ్-1 విద్యార్థి వీసాలను హెచ్‌-1బీ వీసాలుగా ఛేంజ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. ఇది లక్షల మంది భారతీయ యువతకు చాలా ప్రయోజనం కల్పిస్తుంది. దీంతో ఇప్పటి వరకు ఎఫ్‌-1 వీసాలకు ఉన్న చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయినట్లైంది.

Read Also: Oscar 2025 : ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకున్న’సంతోష్’

అయితే, హెచ్‌-1బీ వీసా నాన్‌ ఇమిగ్రెంట్‌ కేటగిరీలోకి రానుంది. టెక్నాలజీ కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను దీని సహాయంతో నియమించుకుంటాయి. ముఖ్యంగా భారత్‌, చైనా దేశాల యువత ఈ వీసా నుంచి చాలా లబ్ధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలకు సౌలభ్యం కల్పించేలా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ సరికొత్త రూల్స్ తీసుకొచ్చింది. దీంతో సంస్థలు తమ అవసరాలకు తగినట్లు నియామకాలు చేసుకుని ప్రపంచ పోటీ మార్కెట్లో నిలదొక్కుకుని ఛాన్స్ ఉంది.

Read Also: Oscars 2025 : ఆస్కార్ రేస్ నుండి ‘లాపతా లేడీస్’ అవుట్

కాగా, 2025 జనవరిలో డొనాల్డ్ ట్రంప్‌ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో జో బైడెన్‌ కార్యవర్గం ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. అలాగే, గతంలోనే హెచ్‌1బీ వీసా ఉన్నవారి పౌరసత్వం, ఇమిగ్రేషన్‌ సేవలకు సంబంధించిన దరఖాస్తులను స్పీడ్ గా ప్రాసెస్‌ చేయనున్నారు. ఈ కొత్త విధానం 2025 జనవరి 17 నుంచి అమలు కానుంది. అమెరికాలో ఏటా 65 వేల హెచ్‌1బీ వీసాలకు పర్మిషన్ లభించనుంది. అదనంగా మరో 20 వేల అడ్వాన్స్‌ డిగ్రీ వీసాలను జారీ చేయనుంది.

Show comments