ఆస్కార్ 2025 షార్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది ఆస్కార్ కమిటీ. ఈ లిస్ట్ అనేక సూపర్ హిట్ సినిమాలు చోటు సంపాదించుకోగా మరికొన్ని సినిమాలు ఈ లిస్ట్ లో చోటు కోల్పోయి షాక్ ఇచ్చాయి. అయితే ఎవరు ఊహించని విధంగా ఓ చిన్న సినిమా ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో చోటు సాధించింది. అదే సంతోష్. షహనా గోస్వామి నటించిన ఈ చిత్రం ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్‌లో అధికారకం ఎంట్రీ ఇచింది. షహనా గో స్వామి బాలీవుడ్ చిత్రాలతో పాటు అనేక హాలీవుడ్ సినిమాలో నటించింది. గతేడాది షబానా లీడ్ రోల్ లో నటించిన హిందీ చిత్రం సంతోష్ . ఈ సినిమా యూకే నుంచి ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ జాబితాలో షార్ట్ లిస్ట్‌లో స్థానం సాధించింది. ఈ చిత్రానికి సంధ్య సూరి దర్శకత్వం వహించారు.
Also Read : Oscars 2025 : ఆస్కార్ రేస్ నుండి ‘లాపతా లేడీస్’ అవుట్
షహనా గోస్వామి మాట్లాడుతూ ‘ ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో స్థానం దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మంచి కథతో రూపొందిన సంతోష్ సినిమాకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆస్కార్ లిస్ట్ లో మా సినిమా చోటు దక్కించుకున్న విషయం చెప్పగానే షాక్‌కు గురయ్యాను. అసలు మా సినిమా ఆస్కార్ దాకా వెళ్తుందని ఊహించలేదు’ అని అన్నారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న లాపతా లేడీస్ కు ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో పేరు లేకపోవడం సంతోష్ చోటు సాధించడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమని నెటిజెన్స్ కామెంట్స్ చేసున్నారు.