Jaya Prada: కోడ్ ఉల్లంఘన కేసులో జయప్రదకు ఊరట
- కోడ్ ఉల్లంఘన కేసులో జయప్రదకు ఊరట
- 2019 లోక్‌సభ ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘించారని కేసు
- ఆధారాలు లేవంటూ కేసు కొట్టేసిన రాంపుర్‌లోని ఎంపీ ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఎంపీ, సినీనటి జయప్రదకు న్యాయస్థానంలో ఊరట లభించింది. స్వర్ పోలీస్ స్టేషన్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘన కేసులో రాంపుర్‌లోని ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు ఆమెను నిర్దోషిగా తేల్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా జయప్రద పోటీ చేశారు. అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పటికీ.. అనుమతి లేకుండా నూర్‌పుర్‌లో బహిరంగ సభ నిర్వహించి రోడ్డును ప్రారంభించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై స్వార్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును విచారించిన ధర్మాసనం.. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా బుధవారం ఆమెను నిర్దోషిగా తేల్చింది. ఈ విషయాన్ని జయప్రద తరఫు న్యాయవాది అరుణ్ ప్రకాశ్ సక్సేనా మీడియాకు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Bomb Threats: విమానాల బాంబు బెదిరింపుల మిస్టరీ వీడింది.. విచారణలో షాకింగ్ విషయాలు!
Also Read
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
నిర్దోషిగా ప్రకటిస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై జయప్రద హర్షం వ్యక్తం చేశారు. తనను రాంపుర్ రాకుండా అడ్డుకోవాలని కొందరు కుట్రలు పన్నుతున్నారన్నారు. ఇది తన రెండో ఇల్లు అని చెప్పారు. మళ్లీ మళ్లీ ఇక్కడికి వస్తూనే ఉంటానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఆజం ఖాన్ చేతిలో ఓడిపోయారు.
ఇది కూడా చదవండి: Belly Fat: బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవడానికి ఇలా చేస్తే వెంటనే మటుమాయం..!
తాజావార్తలు
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!