NTV Telugu Site icon

Jaya Prada: కోడ్ ఉల్లంఘన కేసులో జయప్రదకు ఊరట

Jayaprada

Jayaprada

మాజీ ఎంపీ, సినీనటి జయప్రదకు న్యాయస్థానంలో ఊరట లభించింది. స్వర్ పోలీస్ స్టేషన్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో కోడ్‌ ఉల్లంఘన కేసులో రాంపుర్‌లోని ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు ఆమెను నిర్దోషిగా తేల్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా జయప్రద పోటీ చేశారు. అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పటికీ.. అనుమతి లేకుండా నూర్‌పుర్‌లో బహిరంగ సభ నిర్వహించి రోడ్డును ప్రారంభించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై స్వార్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసును విచారించిన ధర్మాసనం.. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా బుధవారం ఆమెను నిర్దోషిగా తేల్చింది. ఈ విషయాన్ని జయప్రద తరఫు న్యాయవాది అరుణ్‌ ప్రకాశ్ సక్సేనా మీడియాకు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Bomb Threats: విమానాల బాంబు బెదిరింపుల మిస్టరీ వీడింది.. విచారణలో షాకింగ్ విషయాలు!

నిర్దోషిగా ప్రకటిస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై జయప్రద హర్షం వ్యక్తం చేశారు. తనను రాంపుర్ రాకుండా అడ్డుకోవాలని కొందరు కుట్రలు పన్నుతున్నారన్నారు. ఇది తన రెండో ఇల్లు అని చెప్పారు. మళ్లీ మళ్లీ ఇక్కడికి వస్తూనే ఉంటానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఆజం ఖాన్‌ చేతిలో ఓడిపోయారు.

ఇది కూడా చదవండి: Belly Fat: బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవడానికి ఇలా చేస్తే వెంటనే మటుమాయం..!