Jamun-El Niño: విరగకాసిన ‘‘నేరేడు పండ్లు’’, ఈ ఏడాది వర్షాలు అనుమానమే.. అసలేంటీ ఈ సంబంధం..
- ఈ ఏడాది విరగకాసిన నేరేడు పండ్లు .
- నేరేడు పండ్లు విరగకాస్తే కరువు వస్తుందని గ్రామీణ నమ్మకం.
- ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక.
- నేరేడు చెట్ల "స్ట్రెస్ ఫ్రూటింగ్" ప్రవర్తనపై ఆసక్తికర వివరణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jamun-El Niño: ఈ ఏడాది ‘‘నేరేడు పండ్లు’’ విరగకాశాయి. ప్రస్తుతం, మార్కెట్లో చూస్తే నేరేడు పండ్లను విరివిగా అమ్ముతున్నారు. ఇది ఫ్రూట్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నప్పటికీ, ఒక విషయం మాత్రం రైతుల్ని, గ్రామాల్లో ప్రజల్ని భయపెడుతోంది. నేరేడు పండ్ల దిగుబడి పెరిగిన ఏడాదిలో వర్షాలు తగ్గుతాయని, కరువు పరిస్థితులు ఎదురవుతాయని వారి భయం. మన అమ్మలు, తాతలు చెప్పే ఈ విషయంపై క్లారిటీ లేకున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్ని చూస్తే ఇది నిజమనే నమ్మాల్సి వస్తోంది. ఎందుకంటే, ఈ ఏడాది ‘‘ఎల్ నినో’’ ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇది ఏర్పడిన ఏడాది వర్షాలు తక్కువగా ఉంటాయి. పంటలు దెబ్బతింటాయి, కరువు పరిస్థితులు ఏర్పడుతాయి. ఇప్పటికే, వర్షాలు ముహం చాటేశాయి. శాటిలైట్ చిత్రాల్లో మేఘాల జాడ లేదు.
అసలు ఎన్ నినో అంటే ఏమిటి?
పసిఫిక్ సముద్రంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోవడం వల్ల ‘‘ఎల్ నినో’’ అనే వాతావరణ దృగ్విషియం ఏర్పడుతుంది. ఇది ఏర్పడిన ఏడాది భారత్ సహా ఉపఖండం అంతటా వర్షాలు తగ్గుతాయి. రుతుపవనాలు ముఖం చాటేస్తాయి. మరోవైపు, అమెరికా, పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
నేరేడు పండ్లకు ఏం సంబంధం:
నేరేడు పండ్లు విరగకాయడం, నేరేడు చెట్ల ఈ ప్రవర్తనను ‘‘మాస్టింగ్’’ లేదా ‘‘స్ట్రెస్ ఫ్రూటింగ్’’ అని పిలుస్తారు. దీని అర్థం ఏంటంటే, రాబోయే ప్రకృతి విపత్తును మనుషుల కన్నా ముందే మొక్కలు గుర్తించడం. నేరేడు చెట్లు తన జీవితాన్ని పణంగా పెట్టి ఎక్కువగా దిగుబడి ఇస్తుంది. దీనిని సూసైడ్ ఫ్రూటింగ్గా పిలుస్తారు. నేరేడు చెట్ల వేరు భూమి లోకి చాలా లోతుగా వెళ్లాయి. రాబోయే నెలల్లో భూగర్భ జలాలు తగ్గుతాయని, వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉండని పసిగడుతుంది.
ఈ నేపథ్యంతో తనను తాను, తన వంశాన్ని కాపాడుకునే ఉద్దేశంతో చెట్లు కొత్త కొమ్మలకు బదులుగా, తన శక్తినంతా ఖర్చు చేసి పండ్లను ఇస్తుంది. దీని ద్వారా తన వంశాన్ని భవిష్యత్తులో నిలుపుకోవచ్చని భావిస్తుంది. కొత్త విత్తనాల కోసమే చెట్లు ఇలా ఎక్కువగా పండ్లను ఉత్పత్తి చేస్తాయని భావిస్తారు. ఇందుకే మన తాతలు, అమ్మమ్మలు నేరేడు చెట్లు విరగకాస్తే, కరువు తప్పదని చెబుతుంటారు.
దీనికి అనుగుణంగా వాతావరణం:
జూన్ నెల ప్రారంభమై సగం రోజులు పూర్తయినా ఇప్పటికీ సరైన వర్షాలు లేవు. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. గాడ్జిల్లా ఎల్ నినో వస్తోందని ఐఎండీ ఇప్పటికే హెచ్చరించింది. ఇటీవల దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించాయని చెప్పాయి. వీటి వల్ల అరకొర వర్షాలు పడ్డాయి. అయితే, ఇప్పుడు శాటిలైట్ ఇమేజ్‌లలో భారత్‌పై మేఘాల ఛాయలే కనిపించడం లేదు. దీనిని బట్టి చూస్తే ఈ ఏడాది వర్షపాత లోటు తప్పదని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!