Site icon NTV Telugu

Indian Official Killed: పాక్ దాడుల్లో రాజౌరి అడిషనల్‌ డిప్యూటీ కమిషనర్‌ మృతి.. స్పందించిన సీఎం ఒమర్!

Rajoli

Rajoli

Indian Official Killed: భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాజౌరి పట్టణాన్ని టార్గెట్ గా చేసుకుని పాక్ జరిపిన కాల్పుల్లో భారత అధికారి ఒకరు మృతి చెందారు. అయితే, ఈరోజు రాజౌరి పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని పాక్ కాల్పులు జరపడంతో.. రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ అధికారి నివాసం పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడుల్లో ఆయన మరణించారు.

Read Also: India – Pakistan War: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సాధారణ కార్యకలాపాలు.. ప్రయాణికులకు కీలక సూచనలు..

అయితే, రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ మృతిపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. జమ్మూ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ అధికారి మృతి చెందడం దారుణం అన్నారు. అంకిత భావంతో పని చేసే ఓ మంచి అధికారిని కోల్పోయాం అన్నారు. నిన్న నిర్వహించిన వర్చువల్ సమావేశానికి హాజరయ్యారని సీఎం గుర్తు చేశారు.

Read Also: Operation Sindoor : సరిహద్దుల్లో భారత సైన్యం పంజా.. ఉగ్ర స్థావరాలు, డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లు నేలమట్టం..

ఇక, జమ్మూలో పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలకు దిగింది. అలాగే, సరిహద్దు రాష్ట్రాల్లో పాకిస్తాన్ వరుస కాల్పులకు పాల్పడింది. పాక్ డ్రోన్లను ప్రయోగిస్తున్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను భారత దళాలు ధ్వంసం చేశాయి. వీటిని ట్యూబ్- లాంచ్డ్ డ్రోన్‌లను ప్రయోగించడానికి ఉపయోగిస్తున్నారు అని రక్షణ శాఖ తెలిపింది.

Exit mobile version