Jaishankar: అమెరికా టూర్‌కు జయశంకర్.. వ్యూహాత్మక సహకారంపై మార్కో రూబియోతో చర్చలు

  • అమెరికా టూర్‌కు జయశంకర్
  • వ్యూహాత్మక సహకారంపై మార్కో రూబియోతో చర్చలు
  • ఉన్నతాధికారులను కూడా కలవనున్న జైశంకర్
Jaishankar

Jaishankar

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో నిర్వహించే కీలక ఖనిజాల మంత్రుల సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో కీలక ఖనిజాల్లో వ్యూహాత్మక సహకారంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఇక పర్యటనలో భాగంగా జైశంకర్.. అమెరికా ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడా సమావేశమవుతారు.

భారత్-అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలపై రెండు దేశాల అధికారులు చర్చించారు. అయినా కూడా ఒక కొలిక్కి రాలేదు. ఈ విషయంపై కూడా జైశంకర్ చర్చించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: UP Video: సీఎం యోగిని కలిసిన చిన్నారి.. ఏం కోరిక కోరిందంటే..!

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచ దేశాలపై సుంకాల యుద్ధం ప్రకటించారు. భారత్‌పై తొలుత 25 శాతం సుంకం విధించగా… రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు. దీంతో భారత్‌పై 50 శాతం సుంకం విధించినట్లైంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉన్నాయి.