Site icon NTV Telugu

S Jaishankar: ఆపరేషన్ సిందూర్‌కు ముందు ఏం జరిగిందంటే..!

S Jaishankar

S Jaishankar

ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్‌లో వాడీవేడి చర్చ జరిగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లోక్‌సభలో చర్చ ప్రారంభించారు. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విజయాలను వివరించారు. ఇక విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ కూడా ఆపరేషన్ సిందూర్‌పై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌కు ముందు ఏం జరిగిందో సభలో వివరించారు.

ఇది కూడా చదవండి: Trump-Putin: పుతిన్‌కు ట్రంప్ మరోసారి వార్నింగ్.. 2 వారాల్లో శాంతి ఒప్పందం చేసుకోకపోతే..!

ఆపరేషన్ ప్రారంభానికి ముందు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. తన స్థాయిలో 27 కాల్స్ వచ్చాయని.. ప్రధాని మోడీ స్థాయిలో 20 కాల్స్ వచినట్లు పేర్కొ్న్నారు. దాదాపు 35-40 లేఖలు కూడా వచ్చాయన్నారు. ఐక్యరాజ్యసమితిలో 193 దేశాలు ఉన్నాయని.. పాకిస్థాన్ కాకుండా 3 దేశాలు మాత్రమే ఆపరేషన్ సిందూర్‌ను వ్యతిరేకించాయని తెలిపారు. పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పేందుకు ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు వివరించారు.

ఇది కూడా చదవండి: Mahadev Operation: ఉగ్రవాదుల్ని సైన్యం ఎలా మట్టుబెట్టింది.. మహదేవ్ ఆపరేషన్ సీక్రెట్ ఇదే!

ఇక భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణను కుదర్చడంలో ట్రంప్‌ ప్రమేయాన్ని మరోసారి కొట్టిపారేశారు. ఏప్రిల్ 22 నుంచి జూన్ 17 వరకు ప్రధాని మోడీ, ట్రంప్‌ల మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి తామే బాధ్యులమని ప్రకటించిన ‘టీఆర్‌ఎఫ్‌’ను అమెరికా అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా ప్రకటించింది. దీనికి కృషి చేసిన అధికారులకు అభినందనలు చెప్పారు. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకో… లేదంటే రహస్య ఒప్పందాలు చేసుకోవడం కోసమో ఇటీవల చైనాకు వెళ్లలేదని, ఉగ్రవాదంపై భారత్‌ వైఖరిని స్పష్టం చేసేందుకు, ఉద్రిక్తతలను తగ్గించేందుకే వెళ్లినట్లు వెల్లడించారు.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. మతం పేరుతో 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. భార్య, పిల్లల ఎదుటే భర్తలను చంపేశారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అనంతరం భారత ప్రభుత్వం మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. వంద మంది ఉగ్రవాదులను హతమార్చారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలను కూడా ధ్వంసం చేశారు. ఇక పహల్గామ్ ఉగ్రవాదుల కోసం సైన్యం ఎప్పటి నుంచి వేటాడుతోంది. అనూహ్యంగా సోమవారం పార్లమెంట్‌లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరుగుతున్న సమయంలో ఉగ్రవాదుల్ని ఆశ్చర్యంగా సైన్యం హతమార్చింది.

 

Exit mobile version