NTV Telugu Site icon

Karnataka: కర్ణాటకలో జైన మత గురువు హత్య.. ఇద్దరు అరెస్ట్

Karnataka

Karnataka

Karnataka: డబ్బుల విషయంలో ఈ మధ్య కాలంలో హత్యలు పెరిగిపోతున్నాయి. డబ్బులు ఇచ్చిన వారు.. తిరిగి ఇవ్వాలని కోరినప్పుడు దాడులు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన వారు.. డబ్బులు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చిన వారినే హత్య చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఘటనలు ఎక్కువగా చూస్తున్నాము. ఇపుడు కర్ణాటకలో కూడా ఒక మత గురువు కూడా ఇదే విషయంలో హత్య చేయబడ్డాడు. కర్ణాటకలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన జైన మత గురువు హత్య గావించబడ్డాడు. జైన మత గురువు హత్య కేసులు ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రం బెలగావిలోని చికోడి తాలూకాలోని ఒక గ్రామంలో కొనసాగుతున్న ఆశ్రమం నుండి బుధవారం ఒక జైన మత గురువు అదృశ్యమయ్యాడు. అదృశ్యమైన జైన మతగురువు 4 రోజుల తరువాత హత్యకు గురైనట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు పోలీసు అధికారులు ప్రకటించారు.

Read also: Donkey Attack on Man: వ్యక్తిపై గాడిద దాడి.. కాలుపట్టుకుని రోడ్డుపై ఈడ్చుకుంటూ..

ఆచార్య శ్రీ కామకుమార నంది మహారాజ్ గత 15 సంవత్సరాలుగా నంది పర్వత జైన బసదిలో ఉంటున్నారని పోలీసులు తెలిపారు. దర్శనమివ్వడం లేదని భక్తులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జూలై 6న జైన ముని అదృశ్యంపై బసది మేనేజర్ భీమప్ప ఉగారే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని.. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే జైన మత గురువు మృతదేహం కోసం తమ అన్వేషణ కొనసాగుతోందని పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు నిందితులను విచారించగా.. దర్శినిని హత్య చేసి, మృతదేహాన్ని విసిరివేసినట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు. నిందితులు మత గురువు వద్ద డబ్బు అప్పుగా తీసుకున్నారని అధికారి తెలిపారు. ఈ డబ్బుల విషయంలోనే సన్యాసిని డబ్బు సంబంధిత విషయానికి హత్య చేసినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పోలీసు అధికారి తెలిపారు.